సఫారీల చేతిలో భారత్‌కు ఓటమి తప్పలేదు. తొలి వన్డేలో 297 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీం ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 31 పరుగుల తేడాతో సఫారీలు ఘన విజయం సాధించారు. ఫలితంగా 3 వన్డేల సిరీస్‌లోదక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యంలో ఉంది. కోహ్లీ 51, శిఖర్ ధావన్ 79, శార్దుల్ ఠాకూర్ రాణించారు. అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన తొలుత తడబడ్డ తర్వాత సఫారీలు రాణించారు. కాగా సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్లు ఇద్దరూ సెంచరీ నమోదు చేశారు.
సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బావుమా 110 (143) పరుగులను 8 ఫోర్లు తో కొట్టాడు. అలాగే రాస్సి వాన్ డెర్ డస్సెన్ కేవలం 96 బంతుల్లో 129 పరుగులు చేశాడు. అంతే కాకుండా ఈ మ్యాచ్ లో డస్సెన్ 9 ఫోర్లు, 4 సిక్స్ లను కొట్టాడు. ఈ ఇద్దరి బ్యాటింగ్‌కు భారత బౌలర్లు చేతులెత్తేశారు. నాలుగో వికెట్ కు బావుమా, డస్సెన్‌లు ఏకంగా 204 పరుగులను జోడించి సౌత్ ఆఫ్రికా భారీ స్కోరు చేయడానికి కారణం అయ్యారు. భారత బౌలర్లలో బుమ్రా 48 పరుగులిచ్చి రెండు వికెట్లు తీయగా, రవిచంద్రన్ అశ్విన్ 53 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.