Site icon NTV Telugu

Ind vs SA: భారత్‌తో టీ20 సిరీస్‌కు దక్షిణాప్రికా స్టార్ ఆటగాడు దూరం

Mark

Mark

దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్‌ మార్‌క్రమ్‌ భారత్‌తో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. కరోనా పాజిటివ్‌గా తేలడంతో తొలి మూడు మ్యాచ్‌లకు దూరమైన అతడు మిగతా రెండు మ్యాచ్‌ల్లో ఆడడని దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు చెప్పింది. పాజిటివ్‌గా తేలిన తర్వాత మార్‌క్రమ్‌ ఏడు రోజులు ఐసోలేషన్‌లో ఉన్నాడు. అతడు తిరిగి జట్టుతో చేరి సిరీస్‌లో మిగతా మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదని ఆ దేశ క్రికెట్ బోర్డు తెలిపింది. గాయంతో బాధపడుతున్న డికాక్‌పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని క్రికెట్‌ దక్షిణాఫ్రికా పేర్కొంది.

ఈ సిరీస్‌లో దక్షిణాఫ్రికాకు శుభారంభం లభించింది. అయితే ఇప్పుడు మూడో టీ20లో ఓడిపోవడంతో సిరీస్‌ కైవసం చేసుకోవడం కష్టతరంగా మారింది. కాగా మార్‌క్రమ్‌ లేకపోయినా దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ విభాగం చాలా బలంగా ఉంది. ఈ కారణంగానే తొలి టీ20లో ఆతిథ్య జట్టు 211 పరుగులను సులభంగా ఛేదించింది. మార్‌క్రమ్‌కు కొవిడ్‌ సోకినట్లు తొలి టీ20 మ్యాచ్‌కు ముందు దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు ప్రకటించింది . అయితే, జట్టులోని ఇతర సభ్యులెవరూ వైరస్‌ బారిన పడకపోవడంతో సిరీస్‌పై దాని ప్రభావం కనిపించలేదు. ఇప్పటివరకు ఐసోలేషన్‌లో ఉన్న మార్‌క్రమ్‌ తాజాగా స్వదేశానికి బయలుదేరి వెళ్లాడు.

IND vs SA: ద్రవిడ్ ఉన్నంతవరకూ.. భారత్ ఓడిపోదు

ఐపీఎల్‌-2022లో ఐడెన్‌ మార్‌క్రమ్‌ భారీగా పరుగులు సాధించాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున 400కు పైగా పరుగులు సాధించాడు. బ్యాటింగ్‌తో పాటు ఆఫ్‌ స్పిన్‌తోనూ సత్తా చాటగలడీ స్టార్ ప్లేయర్‌. దక్షిణాఫ్రికా టీ20 జట్టులో మార్‌క్రమ్‌ కీలక ఆటగాడు. మొత్తం20 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన అతను 39 సగటు, 147 స్ట్రైక్‌రేట్‌తో 588 పరుగులు చేశాడు. పార్ట్ టైమ్ స్పిన్నర్‌గా కూడా 5 వికెట్లు తీశాడు. ఫామ్‌లో ఉన్న మార్‌క్రమ్ మిగతా రెండు కీలక మ్యాచ్‌లకు లేకపోవడం సఫారీలకు ఎదురుదెబ్బే.

Exit mobile version