IND vs SA 3rd ODI: దక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో భారత బౌలర్లు అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. సఫారీ జట్టును 270 పరుగులకు ఆలౌట్ చేశారు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రాంచీలో టీమిండియా.. రాయ్‌పూర్‌లో సౌతాఫ్రికా గెలిచి 1-1తో సమంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య ఈరోజు జరుగుతున్న మూడో వన్డేలో గెలుపు ద్వారా సిరీస్ ఫలితం తేలనుంది. కాగా, విశాఖపట్నం వేదికగా టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
Read Also: Pushpa 3: ఇక ఇప్పట్లో పుష్ప 3 లేనట్టే?
ఇక, తొలుత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాకు టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ప్రారంభంలోనే గట్టి షాకిచ్చాడు. మొదటి ఓవర్ ఐదో బంతికే ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (0)ను డగౌట్ కు పంపాడు. అయితే, మరో ఓపెనర్ క్వింటన్ డికాక్, వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ టెంబా బవుమాతో కలిసి స్కోర్ బోర్డును చక్కదిద్దాడు. ఈ క్రమంలో డికాక్ సెంచరీ (89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 106 రన్స్ ) పూర్తి చేసుకుని జోరు మీదున్న అతడ్ని ప్రసిద్ కృష్ణ బౌల్డ్ చేశాడు. అలాగే, హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్న బవుమా రవీంద్ర జడేజా బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి 48 పరుగులకే స్టేడియం నుంచి నిష్క్రమించాడు.
Read Also: Avatar & Raja Saab: ప్రభాస్ ‘ది రాజా సాబ్’ కి.. అవతార్ 3 భారీ షాక్
అయితే, దక్షిణాఫ్రికా బ్యాటర్లలో మాథ్యూ బ్రీట్జ్కే (24), డెవాల్డ్ బ్రెవిస్ (29) మాత్రమే చెప్పుకోగదగ్గ పరుగులు చేశారు. ప్రధాన బ్యాటర్లలో మార్క్రమ్ (1) దారుణంగా ఫెయిల్ కాగా.. ఆల్‌రౌండర్లలో మార్కో యాన్సెన్ (17), కార్బిన్ బాష్ (9) కనీసం మైదానంలో నిలవలేకపోయారు. లుంగి ఎంగిడి ఒక్క పరుగుకే అవుట్ కాగా.. చివర్లో కేశవ్ మహరాజ్ 20 పరుగులతో అలరించాడు.
Read Also: Kasuri – Masood: జైషే అగ్ర కమాండర్ల ‘రహస్య సమావేశం’.. భారత్‌పై భారీ కుట్రకు ప్లాన్!
ఈ క్రమంలో 47.5 ఓవర్లలో ప్రొటిస్ జట్టు 270 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో పేసర్ ప్రసిద్ కృష్ణ, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. అలాగే, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీసుకున్నారు. దక్షిణాఫ్రికా విధించిన 271 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది.
