Shubman Gill Wicket: ఒరేయ్ అంపైరు.. కళ్లు కాకులు మింగాయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shubman Gill Wicket In WTC Final Becomes Controversy: ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్‌లో భాగంగా.. శుభ్‌మన్ గిల్ ఔటైన విధానం వివాదాస్పదంగా మారింది. స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో వేగంగా వచ్చిన బంతిని శుభ్‌మన్ అడ్డుకునే ప్రయత్నం చేయగా.. అది మూడో స్లిప్‌లో నిల్చున్న కెమెరాన్ గ్రీన్ చేతిలో వెళ్లింది. ఈ క్యాచ్‌ని గ్రీన్ అందుకున్నాడు కానీ, వేళ్ల మధ్యలో చిక్కుకున్న ఆ బంతి నేలను కూడా తాకింది. ఈ అనుమానంతోనే గిల్ రివ్యూకి వెళ్లాడు. దీన్ని రివ్యూ చేసిన థర్డ్ అంపైర్.. బంతి నేలను తాకలేదని, బంతి కింద గ్రీన్ వేలు ఉందని చెప్పి, గిల్‌ని ఔట్ అయ్యాడని ప్రకటించాడు. థర్డ్ అంపైర్ ఇచ్చిన ఈ నిర్ణయం.. రోహిత్ శర్మతో పాటు యావత్ క్రీడాభిమానులు ఆశ్చర్యపరిచింది. ఆ బంతి నేలను తాకుతున్నట్టు స్పష్టంగా కనిపించినా.. ఔట్ ఎలా ఇస్తారంటూ నెట్టింట్లో ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలోనే.. థర్డ్ అంపైర్‌ని ట్రోల్ చేస్తున్నారు. ‘‘థర్డ్ అంపైర్ ఆసీస్ పక్షపాతిలా ఉన్నాడు, అందుకే నాటౌట్ అని క్లియర్‌గా కనిపిస్తున్నా, ఔట్ ఇచ్చాడు. కళ్లకు గంతులు కట్టుకొని తన నిర్ణయాన్ని వెల్లడించాడు.. RIP థర్డ్ అంపైర్’’ అంటూ అతడ్ని ఏకిపారేస్తున్నారు.
Rashmi : మూగ జీవాల గురించి వైరల్ అవుతున్న రష్మీ పోస్ట్..!!
Also Read
- Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
- Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
- Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
- PCB: షోయబ్ అక్తర్‌కు పీసీబీలో కీలక పోస్టు..! చైర్మన్ నఖ్వీతో భేటీ
కేవలం క్రీడాభిమానులే కాదండోయ్.. కామెంటేటర్స్ కూడా ఈ నిర్ణయం పట్ల ఆశ్చర్యం వ్యక్తపరిచారు. ఓ కామెంటేటర్ మాట్లాడుతూ.. ‘బహుశా బ్యాటర్ స్టీవ్ స్మిత్ అయ్యుంటే, థర్డ్ అంపైర్ కచ్ఛితంగా క్లోజప్‌లో ఆ క్యాచ్‌ని చూసి, బంతి నేలను తాకిందని నిర్ధారించుకొని, నాటౌట్‌గా ఇచ్చేవాడు’ అని చెప్పాడు. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి.. థర్డ్ అంపైర్ నిర్ణయం ఎంత బ్లండరో! ఇండియా గెలుస్తుందన్న భయంతోనే, ఇలాంటి తప్పుడు నిర్ణయాలు ఇస్తున్నారంటూ అందరూ తిట్టిపోస్తున్నారు. వరల్ట్ టెస్ట్ ఛాంపియన్షిప్ లాంటి బిగ్ టోర్నీలో.. ఇలాంటి తప్పులు దొర్లడం నిజంగా సిగ్గుచేటు అని పేర్కొంటున్నారు.
Telugu heros : పారితోషకం విషయంలో తెలుగు హీరోల ఆలోచన మారాలి అంటున్న నిర్మాతలు..?
తాజావార్తలు
-
Khairatabad By Polls : ఉప ఎన్నికపై అధికార పార్టీ వ్యూహం ఏంటి?
-
OTR: కొత్తగూడెం బీఆర్ఎస్లో సరికొత్త సమీకరణాలు..
-
Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
-
Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
-
AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!