NTV Telugu Site icon

Shubman Gill Wicket: ఒరేయ్ అంపైరు.. కళ్లు కాకులు మింగాయా?

Shubman Gill Wicket

Shubman Gill Wicket

Shubman Gill Wicket In WTC Final Becomes Controversy: ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో భాగంగా.. శుభ్మన్ గిల్ ఔటైన విధానం వివాదాస్పదంగా మారింది. స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో వేగంగా వచ్చిన బంతిని శుభ్మన్ అడ్డుకునే ప్రయత్నం చేయగా.. అది మూడో స్లిప్‌లో నిల్చున్న కెమెరాన్ గ్రీన్ చేతిలో వెళ్లింది. ఈ క్యాచ్‌ని గ్రీన్ అందుకున్నాడు కానీ, వేళ్ల మధ్యలో చిక్కుకున్న ఆ బంతి నేలను కూడా తాకింది. ఈ అనుమానంతోనే గిల్ రివ్యూకి వెళ్లాడు. దీన్ని రివ్యూ చేసిన థర్డ్ అంపైర్.. బంతి నేలను తాకలేదని, బంతి కింద గ్రీన్ వేలు ఉందని చెప్పి, గిల్‌ని ఔట్ అయ్యాడని ప్రకటించాడు. థర్డ్ అంపైర్ ఇచ్చిన ఈ నిర్ణయం.. రోహిత్ శర్మతో పాటు యావత్ క్రీడాభిమానులు ఆశ్చర్యపరిచింది. ఆ బంతి నేలను తాకుతున్నట్టు స్పష్టంగా కనిపించినా.. ఔట్ ఎలా ఇస్తారంటూ నెట్టింట్లో ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలోనే.. థర్డ్ అంపైర్‌ని ట్రోల్ చేస్తున్నారు. ‘‘థర్డ్ అంపైర్ ఆసీస్ పక్షపాతిలా ఉన్నాడు, అందుకే నాటౌట్ అని క్లియర్‌గా కనిపిస్తున్నా, ఔట్ ఇచ్చాడు. కళ్లకు గంతులు కట్టుకొని తన నిర్ణయాన్ని వెల్లడించాడు.. RIP థర్డ్ అంపైర్’’ అంటూ అతడ్ని ఏకిపారేస్తున్నారు.

Rashmi : మూగ జీవాల గురించి వైరల్ అవుతున్న రష్మీ పోస్ట్..!!

కేవలం క్రీడాభిమానులే కాదండోయ్.. కామెంటేటర్స్‌ కూడా ఈ నిర్ణయం పట్ల ఆశ్చర్యం వ్యక్తపరిచారు. ఓ కామెంటేటర్ మాట్లాడుతూ.. ‘బహుశా బ్యాటర్ స్టీవ్ స్మిత్ అయ్యుంటే, థర్డ్ అంపైర్ కచ్ఛితంగా క్లోజప్‌లో ఆ క్యాచ్‌ని చూసి, బంతి నేలను తాకిందని నిర్ధారించుకొని, నాటౌట్‌గా ఇచ్చేవాడు’ అని చెప్పాడు. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి.. థర్డ్ అంపైర్ నిర్ణయం ఎంత బ్లండరో! ఇండియా గెలుస్తుందన్న భయంతోనే, ఇలాంటి తప్పుడు నిర్ణయాలు ఇస్తున్నారంటూ అందరూ తిట్టిపోస్తున్నారు. వరల్ట్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లాంటి బిగ్ టోర్నీలో.. ఇలాంటి తప్పులు దొర్లడం నిజంగా సిగ్గుచేటు అని పేర్కొంటున్నారు.

Telugu heros : పారితోషకం విషయంలో తెలుగు హీరోల ఆలోచన మారాలి అంటున్న నిర్మాతలు..?