NTV Telugu Site icon

Shubman Gill: బాబర్ అజామ్‌కి చెక్ పెడుతున్న శుభ్‌మాన్ గిల్.. కెరీర్లో అత్యుత్తమ ర్యాకింగ్..

Shubman Gill

Shubman Gill

Shubman Gill: భారత ఓపెనర్, స్టార్ బ్యాటర్ గా ఎదుగుతున్న శుభ్‌మాన్ గిల్ పాకిస్తాన్ తో జరిగిన మ్యాచులో సత్తా చాటాడు. షాహీన్ అఫ్రిది, రౌఫ్, షాషీన్ షా వంటి పేస్ బలగాన్ని చితక్కొట్టాడు. రోహిత్ శర్మతో కలిసి కీలకమైన భాగస్వామ్యాన్ని నిర్మించాడు. ఈ మ్యాచులో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇదిలా ఉంటే గిల్ తన కెరీర్ లోనే అత్యుత్తమ వన్డే ర్యాకింగ్ సాధించాడు. ICC ODI ర్యాకింగ్స్ లో 2వ స్థానానికి చేరారు. మొదటిస్థానంలో పాకిస్తాన్ జట్టు కెప్టెన్, స్టార్ ఆటగాడు బాబర్ అజామ్ ఉన్నాడు.

Read Also: G20 Summit: జీ20 సదస్సుపై చైనా అక్కసు.. పాకిస్తానే కాస్త నయం..

తన ఆటతీరులో బాబర్ కి షాక్ ఇచ్చేలా ఉన్నాడు. గిల్ తో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు కూడా టాప్ 10 బ్యాటర్ల లిస్టులో ఉన్నారు. కోహ్లీ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 8వ స్థానానికి చేరగా.. రోహిత్ రెండు స్థానాలు ఎగబాకి 9వ స్థానంలో నిలిచారు. నాలుగేళ్ల తరువాత ముగ్గురు భారత బ్యాటర్లు టాప్ 10లో ఉండటం ఇదే తొలిసారి. ఆసియా కప్ 2023లో ఇప్పటి వరకు 154 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

బాబర్ 863 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే.. బాబర్ కన్నా కేవలం 103 పాయింట్ల కంటే తక్కువగా 759 రేటింగ్ పాయింట్లతో శుభ్‌మాన్ రెండో స్థానంలో ఉన్నాడు. అంతకుముందు 2019లో శిఖర్ ధావన్, కోహ్లీ, రోొహిత్ లతో కలిసి ఐసీసీ బ్యాటర్ ర్యాకింగ్స్ లో టాప్-10లో ఉన్నారు. మరోవైపు భారత్ లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆసియా కప్ ప్రదర్శన కారణంగా ఐసీసీ వన్డే బౌలర్ల లిస్టులో 7వ స్థానంలో ఉన్నాడు. స్టార్ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఆల్ రౌండర్ల స్టాండింగ్స్‌లో నాలుగు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకున్నాడు.