NTV Telugu Site icon

Shubman Gill: గిల్ సెంచరీ.. కోహ్లీ రికార్డు బద్దలు

Shubman Gill

Shubman Gill

Shubman Gill: టీమిండియా యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మరోసారి మెరిశాడు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతన్న మొదటి వన్డేలో సెంచరీతో సత్తాచాటాడు. వన్డేల్లో గిల్‌కు ఇది మూడో సెంచరీ కావడం గమనార్హం. ఇక ఈ క్రమంలోనే భారత జట్టు తరఫున అత్యధిక వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. వన్డే కెరీర్‌లో ఆడిన 19 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకుని విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ (24 ఇన్నింగ్స్‌లు) పేరుమీదున్న రికార్డును తిరగరాశాడు. మొత్తంగా పాకిస్థాన్ బ్యాటర్ ఫకార్ జమాన్ (18 ఇన్నింగ్స్‌లు) అందరికంటే ముందున్నాడు.

Read Also: Rohit Sharma: ధోనీ రికార్డును బ్రేక్ చేసిన రోహిత్

బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో డబుల్ సెంచరీతో మెరిసిన ఇషాన్ కిషన్‌ను కాదని ఓపెనర్‌గా గిల్‌కు అవకాశాలు ఇవ్వడం పట్ల విమర్శలు వచ్చాయి. కానీ విమర్శకులకు సమాధానం చెబుతూ వరుస సెంచరీలతో గిల్ దుమ్మురేపుతున్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలోనూ శతకం బాదిన ఈ యువ బ్యాటర్.. తాజాగా ఉప్పల్ మ్యాచ్‌లోనూ 87 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి ఔరా అనిపించాడు. కెప్టెన్ రోహిత్ (34), విరాట్ కోహ్లీ (8), ఇషాన్ కిషన్ (5), సూర్యకుమార్ యాదవ్ (31) అంతగా ఆకట్టుకోలేకపోయారు.