Site icon NTV Telugu

IND vs AUS: టీమిండియాకు బిగ్ షాక్.. మ్యాచ్ మధ్యలోనే పెవిలియన్ కు స్టార్ ప్లేయర్..

Iyer

Iyer

IND vs AUS: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచిన కంగారులు మొదట బ్యాటింగ్ చేస్తున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా, పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇప్పటికే 7 వికెట్లు నష్టపోయిన పోరాడుతోంది. అయితే, ఈ నేపథ్యంలో భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. అద్భుతమైన క్యాచ్ అందుకున్న శ్రేయాస్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో మ్యాచ్ మధ్యలోనే అతడు డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లిపోయాడు.

Read Also: Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదం ఘటనలో బైకర్‌ వీడియో వైరల్..

అయితే, హర్షిత్ రాణా వేసిన ఓ బంతిని ఆస్ట్రేలియా బ్యాటర్ అలెక్స్ కెరీ గాల్లోకి ఆడేశాడు. దీంతో సిక్స్ వెళ్లాల్సిన బంతి అక్కడే ఎగరడంతో.. వెనక్కి పరిగెడుతూ, డైవ్ చేసి మరీ అద్భుతమైన క్యాచ్ ను వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అందుకున్నాడు. ఈ క్యాచ్ అందుకున్న అయ్యర్ కు మాత్రం తీవ్ర గాయమైంది. క్యాచ్‌ పట్టే క్రమంలో కింద పడటంతో నొప్పితో విలవిలలాడిపోయాడు. దీంతో టీమిండియా ఆటగాళ్లు అందరూ అతడ్ని లేపి.. ఫిజీషియన్ ను పిలిచారు. ఆ తర్వాత శ్రేయస్ స్టేడియాన్ని వీడాడు. దీని వల్ల శ్రేయస్ అయ్యర్ గాయం తీవ్రమైతే, అతడు బ్యాటింగ్ చేయడం కష్టమే అంటున్నారు. అతడు బ్యాటింగ్ చేయకపోతే భారత జట్టుకు కష్టాలు తప్పవని చెప్పాలి.

Exit mobile version