Shoaib Akhtar Moves Away From Rawalpindi Express Biopic: ‘‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్’’గా పేరుగాంచిన షోయబ్ అఖ్తర్‌పై అదే పేరతో బయోపిక్ రూపొందించాలని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే! క్యూ ఫిలిం ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ బయోపిక్‌కు ముహ్మద్ ఫర్హాజ్ ఖాసిర్ దర్శకుడు. అయితే.. ఈ బయోపిక్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు షోయబ్ అఖ్తర్ ట్విటర్ మాధ్యమంగా ప్రకటించాడు. ప్రొడక్షన్ హౌస్‌తో తనకు వచ్చిన విబేధాల కారణంగానే.. తాను ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలుగుతున్నట్టు అతడు పేర్కొన్నాడు. అంతేకాదు.. తన అనుమతి లేకుండా ఈ బయోపిక్ రూపొందిస్తే మాత్రం.. తాను లీగల్‌గా యాక్షన్ తీసుకుంటానని కూడా వార్నింగ్ ఇచ్చాడు.
Bandi Sanjay: కేసీఆర్.. మీకు ఇదే చివరి అవకాశం!
‘‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్ బయోపిక్ నుంచి తప్పుకోవడం బాధగా ఉంది. చాలారోజుల పాటు ఆలోచించిన తర్వాతే నేను ఈ నిర్ణయం తీసుకున్నా. నిజానికి.. ఇది నా కలల ప్రాజెక్ట్. ఇందులో కొనసాగడానికే ప్రయత్నించా. కానీ, దురదృష్టవశాత్తూ అన్నీ అనుకున్నట్టు జరగలేదు. కొన్ని నెలల క్రితమే మేకర్స్‌తో మనస్పర్థలు వచ్చాయి. ఈ విభేదాలను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేసినా, ప్రయోజనం లేకుండా పోయింది. అందుకే, ఈ బయోపిక్ రూపొందించడాన్ని విరమించుకోవాలని నిర్ణయం తీసుకున్నా. నా మేనేజ్‌మెంట్ త్వరలోనే మేకర్స్‌తో ఒప్పందాన్ని రద్దు చేసుకోనున్నాయి. చట్టపరమైన అన్ని నిబంధనలు పాటించిన తర్వాతే ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగాను. ఒకవేళ నా అనుమతి లేకుండా మేకర్స్ బయోపిక్‌ను తెరకెక్కిస్తే.. లీగల్‌గా యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా’’ అంటూ అఖ్తర్ ట్వీట్ చేశాడు.
Twitter: యాడ్స్ ఫ్రీగా ట్విట్టర్.. కానీ కండిషన్స్ అఫ్లై.. ఎలాన్ మస్క్ మరో బిగ్ మూవ్..
ఇక అఖ్తర్ క్రికెట్ కెరీర్ విషయానికొస్తే.. 1997లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఇతను, 2011లో గుడ్‌బై చెప్పాడు. పాకిస్తాన్ తరపున 46 టెస్టులు, 163 వన్డేలు, 15 టి20 మ్యాచ్‌లు ఆడాడు. వేగవంతమైన బంతులు ద్వారానే అఖ్తర్ క్రికెట్ చరిత్రలో తనదైన ముద్ర వేశాడు. ఇప్పటికీ అతని పేరిట ఒక రికార్డ్ ఉంది. ఒక మ్యాచ్‌లో 161.3 కి.మీ. వేగంతో బంతి విసిరి.. క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతి విసిరిన బౌలర్‌గా చరిత్రపుటలకెక్కాడు.
Himanta Biswa Sarma: నిన్న షారుఖ్ తెలియదన్నారు.. ఈరోజు ఫోన్‌లో మాట్లాడారు