Shahid Afridi: భారత్‌పై గెలిచే దమ్ము లేదు.. నమీబియాపై గెలిచి ఇంత బిల్డప్ అవసరమా..

  • నమీబియాపై గెలిచి ఇంత బిల్డప్ ఎందుకు..
  • షాదాబ్ ఖాన్‌పై షాహిద్ అఫ్రిది విమర్శలు..
Pakistan

Pakistan

Shahid Afridi: ఇండియా చేతిలో దారుణ ఓటమి తర్వాత పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌పై మాజీ క్రికెటర్లు విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా సీనియర్ ప్లేయర్లు బాబర్ అజమ్, షాదాబ్ ఖాన్, షహీన్ అఫ్రిది ఆటతీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటమికి తమను నిందించడంపై పాక్ క్రికెటర్, ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ సీనియర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనిపై మాజీ స్టార్ ఆటగాడు షాహిద్ అఫ్రిది ఘాటుగా స్పందించాడు. 2021లో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ భారత్‌ను ఓడించిన విషయాన్ని ఒప్పుకుంటూనే.. ఆ తర్వాత వరసగా పరాజయాల పాలైన విషయాన్ని గుర్తు చేశారు.

ప్రస్తుత టీ20 టోర్నీలో పాకిస్తాన్ ప్రదర్శన మాజీలు, ప్రస్తుత ఆటగాళ్ల మధ్య తీవ్ర విభేదాలకు కారణమవుతోంది. మాజీల విమర్శలపై షాదాబ్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘ మా మాజీ క్రికెటర్లకు వారి సొంత అభిప్రాయాలు ఉంటాయి. వారు పాక్‌ కోసం గొప్ప పనులు చేశారు. 2021 ప్రపంచకప్‌లో మేము ఇండియాను ఓడించాము’’ అని అన్నారు.

Read Also: Trump Tariffs: టారిఫ్ వార్‌కు బ్రేక్.. ట్రంప్‌కు యూఎస్ సుప్రీంకోర్టులో బిగ్ షాక్‌..

ఈ విషయాన్ని షాహీద్ అప్రిది ఒప్పుకుంటూనే, ఆ తర్వాత ఏం జరిగిందని ప్రశ్నించారు. ప్రస్తుత ప్లేయర్లకు తమలో తమకు ఎన్ని విభేదాలు ఉన్నా, జట్టుగా రాణించలేకపోయారని విమర్శించారు. షాదావబ్ ఖాన్ బాగా ఆడనప్పుడు, అతడిని జట్టు నుంచి తొలగించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, సీనియర్లు మద్దతు ఇచ్చిన విషయాన్ని అఫ్రిది గుర్తు చేశారు.

నమీబియా వంటి జట్టుపై షాదాబ్ ఖాన్ చెలరేగి ఆడటాన్ని అఫ్రిది ప్రస్తావించాడు. కేవలం నువ్వు నమీబియాపై ఆడావు, పెద్ద జట్లపై ఆడి చూపించు అని సవాల్ విసిరారు. నమీబియాపై షాదాబ్ ఖాన్ 22 బాల్స్‌లో 36 రన్స్ చేశాడు. 3/19 బెస్ట్ బౌలింగ్ గణాంకాలు సాధించాడు. కానీ భారత్ తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం 14 రన్స్, ఒక ఓవర్ వేసి 17 పరుగులు ఇచ్చి తీవ్ర విమర్శల పాలయ్యాడు.