Team India: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది సంచలన ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో ఐసీసీ అండతోనే టీమిండియా విజయాలు సాధిస్తుందని ఆరోపించాడు. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లను చూస్తే ఈ విషయం అర్థమవుతుందని షాహిద్ అఫ్రిది అన్నాడు. ముఖ్యంగా బంగ్లాదేశ్‌తో వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో ఐసీసీ ఒత్తిడితోనే అవుట్ ఫీల్డ్ చిత్తడిగా ఉన్నా.. అంపైర్లు మ్యాచ్ నిర్వహించారని విమర్శలు చేశాడు. ఎలాగైనా టీమిండియా సెమీస్‌కు వెళ్లాలనే ఆలోచనతోనే ఐసీసీ ఇలా వ్యవహరిస్తోందని అఫ్రిది తన అక్కసు వెళ్లగక్కాడు.
Read Also: Imran Khan: గతంలో బంగ్లాదేశ్‌లో జరిగిందే.. ఇప్పుడు పాకిస్తాన్‌లో జరుగుతోంది.
అయితే టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ సాధించిన విజయం కారణంగానే అఫ్రిది ఇలా ఆరోపణలు చేస్తున్నాడని టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు కూడా ప్రమాదంలో పడటంతో టీమిండియా సాధించిన విజయాలను తక్కువ చేసేలా మాట్లాడుతున్నాడంటూ ఎద్దేవా చేస్తున్నారు. కాగా బంగ్లాదేశ్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఐదు పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. ఈ మ్యాచ్ అనంతరం వర్షం కారణంగా అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారడం, ఫేక్ ఫీల్డింగ్ అంటూ బంగ్లాదేశ్ అభిమానులు, ఆటగాళ్లు కూడా ఆరోపణలు చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ అంశాన్ని సాకుగా తీసుకుని అఫ్రిది కూడా తన నోటికి పనిచెప్పాడు.
