US Open 2022: యూఎస్ ఓపెన్‌లో సెరెనా విలియమ్స్ ఓటమి.. అనంతరం క్రీడకు వీడ్కోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Open 2022: యూఎస్ ఓపెన్‌లో ఓటమితో అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్ టెన్నిస్ క్రీడకు వీడ్కోలు పలికింది. మహిళల సింగిల్స్ విభాగంలో మూడో రౌండ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు చెందిన అజ్లా టొమ్లానోవిక్‌తో ఓటమి పాలైన అమెరికన్ టెన్నిస్ లెజెండ్ సెరెనా విలియమ్స్ శుక్రవారం క్రీడకు వీడ్కోలు పలికింది. సెరెనాపై అజ్లా 7-5, 7-5, 6-7, 6-1 తేడాతో విజయం సాధించింది. ఓటమి అనంతరం కన్నీరు పెట్టుకున్న సెరెనా ఇది తన జీవితంలో అపురూపమైన ప్రయాణమని తెలిపింది. తనను ప్రోత్సహించిన వారందరికీ సెరెనా కృతజ్ఞతలు తెలిపింది. ఆమె ఇప్పటివరకు 23 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను సాధించింది.
Gold Rate Today: దిగివస్తున్న పుత్తిడి ధర.. ఇవాళ ఎంత తగ్గిందంటే..?
Also Read
- US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
- WTC Points: పాకిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
- India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
యూఎస్ ఓపెన్ తర్వాత ఆటకు వీడ్కోలు చెబుతానని ఇదివరకే సెరెనా వెల్లడించింది. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ నిర్ణయంపై పునరాలోచన చేసే అవకాశం ఏమైనా ఉందా..? అన్న ప్రశ్నకు ‘మీకు ఎప్పటికీ తెలియకపోవచ్చు’ అని సమాధానం ఇచ్చింది. దీంతో సెరెనా ఆటకు వీడ్కోలు పలకడం ఖాయమని క్రీడా విశ్లేషకులు అంచనా వేశారు. టెన్నిస్‌లో ఉన్నత శిఖరాలకు చేరడం వెనుక తన సోదరి వీనస్ విలియమ్స్ కీలక పాత్ర పోషించిందని సెరెనా విలియమ్స్ వివరించింది. ‘‘వీనస్ లేకపోతే ఇక్కడ సెరెనా ఉండేది కాదు. అందుకే వీనస్‌కు ధన్యవాదాలు చెబుతున్నా. టెన్నిస్‌లో ఉన్నత స్థాయికి రావడానికి కారణం వీనస్. ఇదంతా నా తల్లిదండ్రుల వల్లే.. ప్రతి దానికి వారే అర్హులు. అందుకోసం కృతజ్ఞతాభావంతో ఉంటా. నా కంట్లో నుంచి వచ్చే నీళ్లు ఆనందభాష్పాలు అనుకుంటున్నా’’ అని సెరెనా విలియమ్స్ పేర్కొంది.
తాజావార్తలు
-
Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
-
Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!