Vijay Hazare Trophy: రుతురాజ్ నాలుగు సెంచరీలు వృథా.. విజయ్ హజారే ట్రోఫీ సౌరాష్ట్ర కైవసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay Hazare Trophy: ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ విజేతగా సౌరాష్ట్ర నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో మహారాష్ట్ర ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ మరో సెంచరీ సాధించాడు. అయినా మహారాష్ట్రకు నిరాశ తప్పలేదు. ఫైనల్లో ఆ జట్టుపై సౌరాష్ట్ర 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. షెల్డన్ జాక్సన్ అద్భుత సెంచరీ చేశాడు. 136 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లతో 133 నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 248 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్(131)కు తోడుగా ఏ ఒక్కరూ రాణించలేదు. దాంతో మహారాష్ట్ర సాధారణ స్కోర్‌కే పరిమితమైంది.
Read Also: శృంగార తార సిల్క్ స్మిత జీవితంలో ఇంత విషాదమా..?
Also Read
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
- Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
249 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సౌరాష్ట్ర 46.3 ఓవర్లలో 5 వికెట్లకు 249 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. షెల్డన్ జాక్సన్‌కు తోడుగా హర్విక్ దేశాయ్(50), చిరాగ్ జానీ(30 నాటౌట్) రాణించారు. మహరాష్ట్ర బౌలర్లలో ముఖేశ్ చౌదరి, విక్కీ రెండేసి వికెట్లు తీయగా.. సత్యజీత్ బాచ్లావ్ ఓ వికెట్ పడగొట్టాడు. సౌరాష్ట్ర విజయంలో కీలక పాత్ర పోషించిన షెల్డన్ జాక్సన్‌కు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ లభించింది. కాగా ఈ టోర్నీలో ఐదు ఇన్నింగ్స్‌లలో రుతురాజ్ నాలుగు సెంచరీలు చేయడం విశేషం. అతడు మొత్తం 660 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. మరోవైపు సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనాద్కత్ అటు కెప్టెన్‌గా.. ఇటు బౌలర్‌గా సత్తా చాటాడు. 19 వికెట్లతో ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!