టాలీవుడ్ శృంగార తార  సిల్క్ స్మిత.. పరిచయం అక్కర్లేని పేరు

శృంగార తారగానే ఆమె అందరికి తెలుసు.. కానీ, ఆమె జీవితం మొత్తం విషాదమే

సిల్క్ అసలు పేరు విజయలక్ష్మీ. 1960 డిసెంబర్ 2 న నిరుపేద రైతు కుటుంబం లో పుట్టింది

సినిమా మీద  పిచ్చితో 18 ఏళ్లకే తల్లితో మద్రాస్ చేరింది

నీ మొహంలో గ్లామర్ లేదు, నువ్వు దేనికి పనికిరావు అంటూ నిర్మాతలు ఆమెను తోసేశారు

నల్లగా, బొద్దుగాఉన్నా ఆమెలో కాన్ఫిడెన్స్ పోలేదు.. నన్ను ఎందుకు పనికిరాని అన్నవారితోనే స్టార్ అనిపించుకోవాలని అక్కడే ప్రయత్నాలు మొదలుపెట్టింది

అవకాశాల కోసం పేరునే కాదు బట్టలను  కూడా వదిలేసింది. విజయ నుంచి సిల్క్ గా మారి అందాల ఆరబోతకు సిద్దమయ్యింది

సిల్క్ స్మితగా సెక్సీ డాన్స్ లతో ముందుకు వచ్చిన విజయను చూసి ప్రేక్షకులు పిచ్చెక్కి పోయారు

నిషా కళ్ళతో, మత్తెక్కించే చూపులతో సిల్క్ కుర్రకారుకు ఆరాధ్య దేవతగా మారిపోయింది

బావలు సయ్యా అనడం ఆలస్యం అభిమానులు సై సై అంటూ థియేటర్ కు పరుగులు తీసేశారు

అప్పట్లో సిల్క్ సాంగ్ కోసమే సినిమాకు వచ్చి ఆమె సాంగ్ అవగానే వెళ్లిపోయేవారట ప్రేక్షకులు

కేవలం ఓ డాన్స్ సీన్ కోసం స్మిత 5,00,00 రూపాయలు డిమాండ్ చేసేదట. అప్పట్లో అది రికార్డ్

హాయిగా సినీ జీవితాన్ని కొనసాగిస్తున్న తరుణంలో డాక్టర్ రాధాకృష్ణ ఆమె జీవితంలోకి ఎంటర్ అయ్యాడు

పెళ్లి అయ్యి పిల్లలు ఉన్న రాధాకృష్ణను నమ్మి సిల్క్ మోసపోయింది

ఆ మోసాన్ని సిల్క్ తట్టుకోలేకపోయింది. మందుకు బానిసగా మారింది. డిప్రెషన్ లో కూరుకుపోయింది

1996 సెప్టెంబర్ 23 న తన గదిలో ఫ్యానుకు ఉరి వేసుకొని తనువు చాలించింది

ఎంత స్టార్ స్టేటస్ ను అందుకున్నా మనశ్శాంతి లేదని చెప్పిందే కానీ ప్రియుడు గురించి మాట మాత్రం కూడా చెప్పలేదు

 సిల్క్ భౌతికంగా ఇప్పుడు  లేకపోయినా ఆమె ఎప్పుడు అభిమానుల గుండెల్లోనే ఉంటుంది