Site icon NTV Telugu

Sarfaraz Khan: టీమిండియాలో చోటుపై బీసీసీఐపై సర్పరాజ్ ఖాన్ ఫైర్

Sarfaraz Khan

Sarfaraz Khan

తాజాగా వెస్టిండీస్‌తో టెస్టు, వన్డే సిరీస్‌లకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అదరగొట్టిన యువ ఆటగాళ్లు యశస్వీ జైశ్వాల్‌, రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ లకు సెలక్టర్లు తొలిసారి భారత టెస్టు జట్టులో చోటు కల్పించారు. అయితే గత కొంత కాలంగా దేశీవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్‌ ఖాన్‌కు మాత్రం మరోసారి సెలక్టర్లు మొండిచేయి చూపించారు.

Read Also : Gidugu Rudraraju: వర్మని బట్టలూడదీసి కొడతాం.. ఏపీసీసీసీ చీఫ్ వార్నింగ్

ఈ క్రమంలో భారత సెలక్షన్‌ కమిటీపై విమర్శల పర్వం వ్యక్తం అవుతుంది. రుత్‌రాజ్‌ స్ధానంలో సర్ఫరాజ్‌ ఖాన్‌ ను ఎంపిక చేయాల్సింది అని పలువురు మాజీ క్రికెటర్‌లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. కాగా టెస్టు జట్టుకు తనని ఎంపిక చేయకపోవడంపై సర్ఫరాజ్‌ ఖాన్ ఎట్టకేలకు రియాక్ట్ అయ్యాడు. సర్ఫరాజ్ రంజీ ట్రోఫీలో తన బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్‌ చేశాడు. అయితే ఈ వీడియోకు సర్ఫరాజ్ ఎలాంటి క్యాప్షన్‌ను పెట్టకుండానే వదిలేశాడు.

Read Also : Kajal Agarwal : ట్రెడిషనల్ లుక్ లో కవ్విస్తున్న కాజల్.

సర్ఫరాజ్‌ ఖాన్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గత మూడు రంజీ సీజన్లలో సర్ఫరాజ్‌ పరుగుల వరద పారించాడు. 2019-20 సీజన్‌లో 900 పరుగులు చేయగా.. 2020-21 సీజన్‌లోనూ 900 పరుగులు, 2022-23 సీజన్‌లో 600 లకు పైగా పరుగులు చేశాడు. మూడు సీజన్‌లలో అతడి సగటు కూడా 100కి పైగా ఉంది. ఓవరాల్‌గా ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో ఇప్పటివరకు 34 మ్యాచ్‌లు ఆడిన సర్ఫారాజ్‌ ఖాన్.. 3175 పరుగులు చేశాడు.

Read Also : Karnataka: ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. భార్య గొంతు కోసి రక్తం తాగిన భర్త..

కానీ రంజీల్లో అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్న సర్ఫరాజ్ ఖాన్ పై బీసీసీఐ వివక్ష చూపిస్తుందని పలువురు మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు సెలక్షన్ కమిటీపై కూడా సర్ఫరాజ్ ఖాన్ పరోక్షంగా విమర్శలు గుప్పించాడు.

Exit mobile version