NTV Telugu Site icon

Sara Ali Khan and Shubman Gill: యంగ్ క్రికెటర్‌తో సారా అలీఖాన్‌ డేటింగ్‌..! ఇదిగో సాక్ష్యం

Sara Ali Khan And Shubman G

Sara Ali Khan And Shubman G

సెలబ్రిటీలు ఏం చేసినా వార్తే.. కలిసి బయటకు వచ్చినా.. ఎవరినైనా కలిసినా.. డిన్నర్‌ చేసినా.. పార్టీకి వెళ్లినా.. అన్ని కళ్లు వారిపైనే ఉంటాయి.. ఇప్పుడు టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్, బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ వ్యవహారం ఇప్పుడు.. నెటిజన్లకు పనిపెట్టింది.. ఇంతకీ వీళ్లు ఏం చేశారంటే.. ఓ రెస్టారెంట్ లో ఇద్దరూ కలిసి డిన్నర్ చేశారు. అయితే, ఓ అభిమాని ఆ దృశ్యాలను తన ఫోన్‌లో బంధించి సోషల్‌ మీడియాలో వదలడంతో.. ఇప్పుడు అవి వైరల్‌గా మారిపోయాయి..

Read Also: Rishabh Pant: అక్క.. దయచేసి నన్ను ఒంటరిగా వదిలెయ్

శుభ్‌మన్‌ గిల్‌, సారా అలీఖాన్‌ ఉన్న వీడియో వైరల్‌ అయిపోయింది.. వెయిటర్ కు ఆర్డర్ చేయడం కూడా వీడియోలో రికార్డు అయ్యింది.. మొత్తంగా TikToker ఉజ్మా మర్చంట్ (@uxmiholics) షేర్‌ చేసిన వీడియో, ముంబైలోని బాస్టియన్‌లో సారా మరియు శుభ్‌మాన్ గిల్‌లు తమ టేబుల్ పక్కన వెయిటర్‌తో ఆర్డర్ ఇస్తున్నట్లు చూపించారు. సారా గులాబీ రంగు దుస్తులలో కనిపించగా, శుభ్‌మన్ తెలుపు మరియు ఆకుపచ్చ రంగు చొక్కా ధరించారు. ఇద్దరు సెలబ్రిటీలు కలిసి కనిపించడం పట్ల అభిమానులు ఆశ్చర్యపోయారు. ఏం జరుగుతోంది? అని ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు సెలబ్రిటీలు.. అది కూడా యంగ్‌ ఏజ్‌లో ఉన్న ఓ జంట ఒక్కచోట చేరిందంటే.. ఏముంది.. చూసేవారికి అనేక సందేహాలు.. ఇద్దరి మధ్య ఏం నడుస్తోంది..? డేటింగ్‌ చేస్తున్నారా? ఊరికే కలిశారా? ఏమైనా జంట బాగుంది?.. జోడీ కుదురింది..? లాంటి కామెంట్లు పెడుతూ.. వైరల్‌ చేస్తున్నారు నెటిజన్లు.. కాగా, క్రికెట్‌ గార్డ్‌ సచిన్ కూతురు సారాతో గిల్ డేటింగ్ చేస్తున్నాడంటూ అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి.. ఇప్పుడు మరోసారా.. అంటే సారా అలీఖాన్ తో కనిపించడంతో కొత్త అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా.. వాళ్లు క్లారిటీ ఇచ్చే వరకు.. ఎవరికి తోచింది వారు మాట్లాడుకోవచ్చు.

సారా అలీ ఖాన్ నటులు సైఫ్ అలీ ఖాన్ మరియు అమృతా సింగ్ ల కుమార్తె. ఆమె మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ మరియు షర్మిలా ఠాగూర్‌ల మనవరాలు కూడా. ఆమె 2017లో కేదార్‌నాథ్‌తో తొలిసారిగా నటించింది. సింబా మరియు లవ్ ఆజ్ కల్ వంటి చిత్రాలలో కనిపించింది. అంతేకాదు.. సారా అలీఖాన్‌.. కార్తీక్ ఆర్యన్‌తో డేటింగ్ చేస్తున్నట్లు గతంలో పుకార్లు వచ్చాయి, దీనిని చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఇటీవల ధృవీకరించారు. సారా 2018లో కాఫీ విత్ కరణ్‌లో కనిపించింది మరియు ఆమె ఆకర్షణీయంగా కనిపించిన నటుడిగా కార్తీక్ ఆర్యన్ పేరును ప్రస్తావించింది. తరువాత ఇద్దరూ కలిసి లవ్ ఆజ్ కల్‌లో నటించారు.. వారి ప్రేమ అక్కడ వికసించిందనే ప్రచారం సాగింది.. అయితే, 2020లో వారు విడిపోయారు. అప్పటి నుండి, వారు ఎప్పుడూ బహిరంగంగా కలిసిందిలేదు.. సారా తన తర్వాత ప్రాజెక్ట్‌.. లక్ష్మణ్ ఉటెక్ దర్శకత్వంలో విక్కీ కౌశల్‌తో కలిసి నటించనుంది. ఇక, వెస్టిండీస్ మరియు జింబాబ్వేతో జరిగిన వన్డేలో రెండు బ్యాక్-టు-బ్యాక్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను గెలుచుకున్న శుభ్‌మాన్ గిల్, ఇప్పటివరకు 11 టెస్టులు మరియు 9 వన్డేల్లో ఆడాడు.