Sanju Samson: అప్పుడే ఆత్మవిశ్వాసం పెరిగింది.. భయం లేకుండా క్రికెట్ ఆడుతా.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన ఐదో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ముగిసింది. శనివారం రాత్రి బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దాంతో అంపైర్లు మ్యాచ్‌ను 9 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 7.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. ఆపై వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. ఆ తర్వాత ఆటకు అవకాశం లేకపోవడంతో రద్దు తప్పలేదు. దాంతో సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌కు ముందు భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌తో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ మాట్లాడుతూ.. తన ఆటతీరు, మానసిక సిద్ధత, న్యూజిలాండ్‌తో జరగనున్న సిరీస్‌కు సంబంధించిన సన్నాహాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
టీ20 ప్రపంచ కప్ 2026లో బాగా ఆడటం తనకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని సంజు శాంసన్ తెలిపాడు. బయటి విమర్శలు, ఒత్తిడిని పక్కనపెట్టి ఆటపై దృష్టి పెట్టడం ముఖ్యమని పేర్కొన్నాడు. ‘ప్రపంచ కప్‌లో బాగా ఆడటం కచ్చితంగా ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఆ తర్వాత మన ఆటతీరులోని విధానాలను మనమే అర్థం చేసుకోవడం ప్రారంభిస్తాం. మనం అనుసరిస్తున్న ప్రక్రియపై దృష్టి పెట్టాలి. బయటి నుంచి వచ్చే విమర్శలు, ఇతర విషయాల ప్రభావాన్ని తగ్గించుకోవాలి. మైదానంలోకి వెళ్లి అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి మనసును ఎలా సిద్ధం చేసుకోవాలో మనమే తెలుసుకోవాలి. కొన్నిసార్లు పరుగులు చేస్తాం, మరికొన్నిసార్లు చేయలేకపోవచ్చు. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటూ.. ఎప్పుడూ నేల మీదే ఉంటూ, భయం లేకుండా క్రికెట్ ఆడటాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తాను’ అని సంజు చెప్పాడు.
Also Read
- Team India Record: టీమిండియా చరిత్రలోనే ఘోర ఓటమి.. దెబ్బకు రికార్డులు తారుమారు..
- Will Young: నేను 125 పరుగులు చేసినా వేస్ట్ అయింది.. విల్ యంగ్ ఆవేదన..
- Mitchell Santner: "చాలా హ్యాపీగా ఉన్నాం.. ఇక రిలాక్స్ అవుతాం".. గ్రాండ్ విక్టరీపై కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
వర్షం పడుతూ మ్యాచ్ ప్రారంభం కాకుండా ఆలస్యమైనప్పుడు మీ మనసులో ఎలాంటి ఆలోచనలు వస్తుంటాయి? అనే ప్రశ్నకు.. ‘డ్రెస్సింగ్ రూమ్‌లో మీలాంటి వ్యక్తి (యుజ్వేంద్ర చహల్) ఉంటే బాగుంటుంది. అక్కడి వాతావరణాన్ని సరదాగా మార్చగల వ్యక్తి అవసరం. వర్షం పడుతున్నప్పుడు ఆ సమయంలో క్రికెట్ గురించి మరీ ఎక్కువగా ఆలోచించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్ తమను తాము ఏదో ఒక పనిలో బిజీగా ఉంచుకుంటున్నారు. డ్రెస్సింగ్ రూమ్‌లో సాధారణంగా పరిస్థితులు ఇలాగే ఉంటాయి’ అని తెలిపాడు.
న్యూజిలాండ్‌తో జరగనున్న సిరీస్‌కు మీ సన్నాహాలు ఎలా ఉన్నాయి? అని అడగ్గా… ‘నిజం చెప్పాలంటే ప్రస్తుతం షెడ్యూల్ ఉండే విధానం వల్ల సాధన చేయడానికి, ప్రత్యేకంగా సిద్ధమవడానికి ఎక్కువ సమయం దొరకడం లేదు. ఇలాంటి సమయంలో మన అనుభవం ఉపయోగపడుతుంది. మానసికంగా ప్రశాంతంగా, మంచి స్థితిలో ఉండేందుకు ప్రయత్నించాలి. మనకు లభించే సమయాన్ని సాధ్యమైనంత సమర్థంగా ఉపయోగించుకోవాలి. మాకు బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంది. 20వ తేదీన అక్కడికి చేరుకుంటాం. 21వ తేదీన సాధన చేసి, 22వ తేదీన మ్యాచ్ ఆడతాం. కాబట్టి ఇక్కడ మేము సాధించిన మంచి విషయాలను అక్కడ కూడా కొనసాగించేందుకు ప్రయత్నిస్తాం. అక్కడి పరిస్థితులకు అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది. అందుకే మొదటి రెండు మూడు బంతులను ఆడిన తర్వాత పరిస్థితులను అంచనా వేస్తాం. గత అనుభవాల ద్వారా నేర్చుకున్న విషయాలను అనుసరిస్తూ, అక్కడి పరిస్థితులను గౌరవిస్తూ మా ఆటను కొనసాగిస్తాం’ అని సంజు శాంసన్ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!