Sanju Samson Gets Bumper Offer From BCCI: ప్రతిభ ఉన్నప్పటికీ సంజూ శాంసన్‌కు అవకాశాలు మాత్రం రావడం లేదు. వరుస ఫ్లాప్ అవుతున్నప్పటికీ కొందరు ఆటగాళ్లకు ఛాన్సులు వస్తుంటే, సంజూని మాత్రం అదృష్టం వరించడం లేదు. పుష్కరాలకోసారి అన్నట్టు ఛాన్స్ వచ్చినప్పుడేమో.. సంజూ సత్తా చాటలేకపోతున్నాడు. అయితే.. సత్తా చాటుకోవడానికి అతనికి మరిన్ని ఛాన్సులు ఇవ్వాలని ఫ్యాన్స్‌తో మాజీల నుంచి డిమాండ్స్ వస్తూనే ఉన్నాయి. మరి, అతనికి జట్టులో ఎప్పుడు చోటు దక్కుతుందో తెలీదు కానీ, ప్రస్తుతానికి మాత్రం ఒక బంపరాఫర్ పట్టేశాడు. బీసీసీఐ అతనికి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చి, తగిన గుర్తింపు ఇచ్చింది. సంజూకు తొలిసారి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చిన బీసీసీఐ.. గ్రేడ్-సీ కేటగిరీ ఆటగాళ్ల జాబితాలో చోటు కల్పించింది. ఈ ఒప్పందం ప్రకారం.. సంజూకు సంవత్సరానికి గాను రూ.1 కోటి వేతనం లభిస్తుంది.
Kolkata Knight Riders: కేకేఆర్ షాకింగ్ ట్విస్ట్.. కెప్టెన్‌గా ఊహించని పేరు
సంజూతో పాటు దీపక్ హుడా, కేఎస్ భరత్, అర్షదీప్ సింగ్‌లకు బీసీసీఐ తొలిసారి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చిన బీసీసీఐ.. వీరిని కూడా గ్రేడ్-సీ కేటగిరిలో చేర్చింది. అంటే.. సంజూకి సమానంగా వీళ్లు కూడా ఏటా రూ.1 కోటి వేతం అందుకుంటారు. ఇదే కాదు.. వార్షిక కాంట్రాక్ట్ జాబితాలో బీసీసీఐ కొన్ని మార్పులు చేసింది. ఇప్పటికే రవీంద్ర జడేజా ఏ గ్రేడ్‌లో ఉండగా.. అతడ్ని ఇప్పుడు ఏ+ గ్రేడ్‌కు ప్రమోట్ చేసింది. ఫలితంగా అతడు ఏటా రూ.7 కోట్ల వేతనం అందుబోతున్నాడు. మరోవైపు.. కేఎల్ రాహుల్ ఈమధ్య ఫామ్ కోల్పోయి వరుస వైఫల్యాల్ని మూటగట్టుకోవడంతో, అతడ్ని ఏ గ్రేడ్ నుంచి బీ గ్రేడ్‌కు డిమోట్ చేసింది. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో అక్షర్ పటేల్ అద్భుతంగా రాణించడంతో.. అతడ్ని బీ గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్‌కు ప్రమోట్ చేసింది. వెటరన్ ఆటగాళ్లు ఆజింక్య రహానే, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్‌లను పూర్తిగా కాంట్రాక్ట్ జాబితా నుంచి తప్పించింది.
Shikhar Dhawan: రాజకీయాల్లోకి వస్తా.. గబ్బర్ షాకింగ్ స్టేట్‌మెంట్
కాంట్రాక్ట్ జాబితా:
1. ఏ+ గ్రేడ్ (రూ. 7 కోట్లు): రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా
2. ఏ గ్రేడ్ (రూ. 5 కోట్లు): హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమీ, రిషభ్ పంత్, అక్షర్ పటేల్.
3. బీ గ్రేడ్ (రూ. 3 కోట్లు): ఛటేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మహమ్మద్ సిరాజ్, సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్.
4. సీ గ్రేడ్ (రూ. 1 కోటి): ఉమేశ్ యాదవ్, శిఖర్ ధావన్, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, శ్రీకర్ భరత్