Sanju Samson: భారత జట్టుకి నిరసన సెగ.. అతని ఫ్యాన్స్ తాండవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanju Samson Fans Protest At Thiruvananthapuram: సంజూ శాంసన్‌కి భారత జట్టులో చోటు ఇవ్వకపోవడంపై.. అతని అభిమానులు ఎంత అసంతృప్తితో ఉన్నారో అందరికీ తెలిసిందే! వీలు చిక్కినప్పుడల్లా.. మంచి ప్రతిభ ఉన్నప్పటికీ సంజూకి ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని నిలదీస్తూనే ఉంటారు. ఇప్పుడు భారత జట్టు తిరువనంతపురంలో అడుగుపెట్టగా.. వారి సెగ తగిలింది. ఎయిర్‌పోర్టులో భారత ఆటగాళ్లు దిగడమే ఆలస్యం.. భారీ సంఖ్యలో అక్కడికి తరలివచ్చిన సంజూ శాంసన్ అభిమానులు, ‘సంజూ సంజూ’ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. అతని నామస్మరణంతో ఎయిర్పోర్ట్ ప్రాంగణం దద్దరిల్లిపోయేలా చేశారు. సాధారణంగానే సంజూకి దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. కేరళ అతని సొంత రాష్ట్రం కావడంతో.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో స్థానంలో ఇవ్వకపోవడంతో ఇలా ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను భారత కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు చాహల్, అశ్విన్ తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. సంజూ నామస్మరణంతో త్రివేండ్రం మార్మోగిపోయిందంటూ తమ పోస్టుల్లో పేర్కొన్నారు. తమ మద్దతు కూడా అతనికి ఉంటుందన్నట్టుగా వాళ్లు ఈ ఫోటోలను షేర్ చేసినట్టు తెలుస్తోంది.
కాగా.. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌ని 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా, ఇప్పుడు సౌతాఫ్రికాతో టీ20 & వన్డే సిరీస్‌లు ఆడబోతోంది. ఈ రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లు జరగనున్నాయి. ఆస్ట్రేలియా సిరీస్‌ని కైవసం చేసుకున్న జోష్‌లో ఉన్న భారత్.. సౌతాఫ్రికాతో తలపడనున్న ఈ రెండు సిరీస్‌లను సైతం నెగ్గాలని భావిస్తోంది. కాగా.. సెప్టెంబర్ 28వ తేదీన తిరువనంతపురం వేదికగా సౌతాఫ్రికాతో భారత్ తొలి టీ20 మ్యాచ్ ఆడబోతోంది.
Also Read
- IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(కీపర్), దినేశ్ కార్తిక్(కీపర్), దీపక్ హుడా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు