NTV Telugu Site icon

Sanju Samson: భారత జట్టుకి నిరసన సెగ.. అతని ఫ్యాన్స్ తాండవం

Sanju Samson Fans

Sanju Samson Fans

Sanju Samson Fans Protest At Thiruvananthapuram: సంజూ శాంసన్‌కి భారత జట్టులో చోటు ఇవ్వకపోవడంపై.. అతని అభిమానులు ఎంత అసంతృప్తితో ఉన్నారో అందరికీ తెలిసిందే! వీలు చిక్కినప్పుడల్లా.. మంచి ప్రతిభ ఉన్నప్పటికీ సంజూకి ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని నిలదీస్తూనే ఉంటారు. ఇప్పుడు భారత జట్టు తిరువనంతపురంలో అడుగుపెట్టగా.. వారి సెగ తగిలింది. ఎయిర్‌పోర్టులో భారత ఆటగాళ్లు దిగడమే ఆలస్యం.. భారీ సంఖ్యలో అక్కడికి తరలివచ్చిన సంజూ శాంసన్ అభిమానులు, ‘సంజూ సంజూ’ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. అతని నామస్మరణంతో ఎయిర్‌పోర్ట్ ప్రాంగణం దద్దరిల్లిపోయేలా చేశారు. సాధారణంగానే సంజూకి దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. కేరళ అతని సొంత రాష్ట్రం కావడంతో.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో స్థానంలో ఇవ్వకపోవడంతో ఇలా ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను భారత కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు చాహల్, అశ్విన్ తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. సంజూ నామస్మరణంతో త్రివేండ్రం మార్మోగిపోయిందంటూ తమ పోస్టుల్లో పేర్కొన్నారు. తమ మద్దతు కూడా అతనికి ఉంటుందన్నట్టుగా వాళ్లు ఈ ఫోటోలను షేర్ చేసినట్టు తెలుస్తోంది.

కాగా.. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌ని 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా, ఇప్పుడు సౌతాఫ్రికాతో టీ20 & వన్డే సిరీస్‌లు ఆడబోతోంది. ఈ రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లు జరగనున్నాయి. ఆస్ట్రేలియా సిరీస్‌ని కైవసం చేసుకున్న జోష్‌లో ఉన్న భారత్.. సౌతాఫ్రికాతో తలపడనున్న ఈ రెండు సిరీస్‌లను సైతం నెగ్గాలని భావిస్తోంది. కాగా.. సెప్టెంబర్ 28వ తేదీన తిరువనంతపురం వేదికగా సౌతాఫ్రికాతో భారత్ తొలి టీ20 మ్యాచ్ ఆడబోతోంది.

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(కీపర్), దినేశ్ కార్తిక్(కీపర్), దీపక్ హుడా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్.

Show comments