Sanju Samson: రజనీకాంత్‌పై అభిమానం నెక్స్ట్ లెవల్.. ‘జైలర్ 2’ కోసం థియేటర్ మొత్తం బుక్ చేసిన సంజు శాంసన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanju Samson Watched Rajinikanth’s Jailer 2: ‘సూపర్‌స్టార్’ రజనీకాంత్‌కు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. రజినిపై తనకున్న అభిమానాన్ని సంజు మరోసారి చాటుకున్నాడు. ‘జైలర్ 2’ను సినిమాను చూసేందుకు ఏకంగా థియేటర్ మొత్తాన్ని బుక్ చేశాడు. ఈ విషయాన్ని సంజునే స్వయంగా తెలిపాడు. థియేటర్ వద్ద సంజు చేసిన సందడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తన అభిమాన నటుడి సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూసిన సంజు తెగ సంబరపడిపోయాడు.
రజనీకాంత్ సినిమాలంటే తనకు ఎంతో ఇష్టమని సంజు శాంసన్ గతంలోనూ పలుమార్లు చెప్పాడు. ఆయన కొత్త సినిమా విడుదలైనప్పుడల్లా వీలైనంత త్వరగా చూడాలని అనుకుంటానని తెలిపాడు. అయితే ఢిల్లీలో ఓ కార్యక్రమం ఉండటంతో జైలర్ 2 విడుదలైన రోజున సినిమాను చూడలేకపోయానని వెల్లడించాడు. దీంతో మరుసటి రోజు ప్రత్యేకంగా సినిమా చూసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. జైలర్ 2 సినిమా చూసేందుకు థియేటర్‌కు వచ్చిన సందర్భంగా సంజు తన ఆనందాన్ని పంచుకున్నాడు. ‘రజనీ సర్ సినిమాలు చూడటం నాకు చాలా ఇష్టం. ఆయన తర్వాతి సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటాను. జైలర్ 2 విడుదలైన రోజున చూడలేకపోయాను. నిన్న ఢిల్లీలో ఓ కార్యక్రమం ఉండటంతో కుదరలేదు. అందుకే ఒక రోజు ఆలస్యంగా సినిమా చూడబోతున్నాను’ అని చెప్పాడు.
Also Read
- Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
- India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
- WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!
- Manvanth Kumar: సంచలనం.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టిన కర్ణాటక ఆల్‌రౌండర్..!
‘ఈసారి సినిమా చూసేందుకు మొత్తం థియేటర్‌ను బుక్ చేసుకునే అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నా. నా భార్య, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సినిమా చూసే అవకాశం వచ్చింది. టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌లో తమిళం తెలిసిన వారందరూ వస్తున్నారు. రజనీకాంత్‌ను పెద్ద తెరపై చూసేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నా’ అని సంజు శాంసన్ చెప్పుకొచ్చాడు. రజనీకాంత్‌కు దేశవ్యాప్తంగా భారీ అభిమానగణం ఉంది. ఆయన ప్రత్యేకమైన స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. రజిని సినిమాల విడుదలను అభిమానులు ఓ వేడుకలా జరుపుకుంటారు. అలాంటి సూపర్‌స్టార్‌పై తనకున్న అభిమానాన్ని సంజు ఈ ప్రత్యేక ప్రదర్శనతో మరోసారి చాటుకున్నాడు.
తాజావార్తలు
-
Drinking Water Alert: పండగ వేళ హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం!
-
EMI: అప్పు చేసి చిప్ప కూడు..! చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా పండుగల వేళ కొంతమంది హెచ్చులు!
-
Sanju Samson: రజనీకాంత్‌పై అభిమానం నెక్స్ట్ లెవల్.. ‘జైలర్ 2’ కోసం థియేటర్ మొత్తం బుక్ చేసిన సంజు శాంసన్!
-
Tuesday Astrology: విజయదశమి నాటి దినఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని లాభాలు!
-
Chairman’s Desk : ఎల్‌నినో సంక్షోభం.. ఒత్తిడిలో ప్రపంచం..!
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!