Brand Value: రిటైర్ అయినా తగ్గని బ్రాండ్ విలువ.. రూ.1,189 కోట్లతో టాప్‌లో.. కోహ్లీ, ధోనీ కాదండోయ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి ఎన్నో ఏళ్లు అవుతున్నా.. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బ్రాండ్ విలువ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. క్రీడా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సచిన్.. ఇప్పటికీ దేశంలోని అత్యంత ప్రభావవంతమైన సెలబ్రిటీ బ్రాండ్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. క్రోల్ ఇండియా సెలబ్రిటీ బ్రాండ్ వాల్యూ 2025 నివేదిక ప్రకారం.. సచిన్ బ్రాండ్ విలువ 125.9 మిలియన్ డాలర్లు. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.1,189 కోట్లు. ఈ బ్రాండ్ విలువతో దేశంలోని టాప్-5 సెలబ్రిటీ బ్రాండ్లలో స్థానం సంపాదించారు.
అంతేకాదు భారత టాప్-10 సెలబ్రిటీ బ్రాండ్ల జాబితాలో చోటు దక్కించుకుంటున్న ఏకైక మాజీ క్రికెటర్ కూడా సచిన్ టెండూల్కరే. ఏటా ఆయన బ్రాండ్ విలువ పెరుగుతుండటానికి ప్రజల్లో ఉన్న విశ్వాసం, గౌరవం, నమ్మకం ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. దీంతో వివిధ రంగాలకు చెందిన ప్రముఖ బ్రాండ్లకు సచిన్ ఇప్పటికీ ఆకర్షణీయమైన ప్రచారకర్తగా కొనసాగుతున్నారు. క్రికెట్లో సచిన్ సాధించిన రికార్డులు ఆయన బ్రాండ్ విలువకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఆ కాలంలో టాప్ బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన సచిన్.. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచారు. టెస్టులు, వన్డేల్లో కలిపి అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు కూడా ఆయన పేరిటే ఉంది.
Also Read
- WTC 2025-27: ఆస్ట్రేలియా టాప్, భారత్ 5వ స్థానం.. మిగిలిన 9 మ్యాచ్‌లు డూ ఆర్ డై..
- John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
- R Praggnanandhaa: చెస్ వరల్డ్ లో భారత్ ఆధిపత్యం.. సెయింట్ లూయిస్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానంద
- Ishan Kishan: బ్యాంక్ ఉద్యోగం, క్రికెట్ సరిపోలేదా?.. పార్ట్ టైమ్ టీ కొట్టు ఎప్పుడు పెట్టావ్ ఇషాన్ కిషాన్ భాయ్?
అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ మొత్తం 34,357 పరుగులు చేశారు. క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచారు. రెండు దశాబ్దాలకు పైగా సాగిన తన కెరీర్లో సచిన్ ఎన్నో రికార్డులను నెలకొల్పారు. వాటిలో కొన్ని రికార్డులు ఇప్పటికీ ప్రత్యేకంగానే నిలిచాయి. సచిన్ 200 టెస్టు మ్యాచ్‌లు ఆడారు. టెస్టు ఫార్మాట్లో 200 మ్యాచ్‌లు ఆడిన ఆటగాడు మరొకరు లేరు. టెస్టుల్లో సచిన్ 15,921 పరుగులు చేయగా.. అందులో 51 సెంచరీలు ఉన్నాయి. 15,000 టెస్టు పరుగుల మైలురాయిని కేవలం 300 ఇన్నింగ్స్‌ల్లోనే సచిన్ అందుకున్నారు.
వన్డే క్రికెట్లోనూ సచిన్ రికార్డులు అసాధారణమైనవే. 22 సంవత్సరాల 91 రోజుల పాటు సాగిన ఆయన వన్డే కెరీర్.. ఈ ఫార్మాట్లో సుదీర్ఘమైన కెరీర్లలో ఒకటిగా నిలిచింది. 1998లో కేవలం ఒకే క్యాలెండర్ సంవత్సరంలో 1,894 పరుగులు, తొమ్మిది సెంచరీలు చేసిన రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. వన్డేల్లో సచిన్ 145 అర్ధ సెంచరీలు సాధించడంతో పాటు 2,016 ఫోర్లు బాదారు. వన్డేల్లో 18,000 పరుగుల మైలురాయిని కేవలం 440 ఇన్నింగ్స్‌ల్లోనే చేరుకున్నారు. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత కూడా సచిన్‌పై అభిమానుల్లో ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. మైదానంలో సాధించిన రికార్డులతో పాటు.. వ్యక్తిగత ప్రతిష్ఠ, విశ్వసనీయత, ప్రజల్లో ఉన్న అపారమైన గౌరవం ఆయనను ఇప్పటికీ అత్యంత విలువైన సెలబ్రిటీ బ్రాండ్లలో ఒకరిగా నిలబెడుతున్నాయి.
తాజావార్తలు
-
Brand Value: రిటైర్ అయినా తగ్గని బ్రాండ్ విలువ.. రూ.1,189 కోట్లతో టాప్‌లో.. కోహ్లీ, ధోనీ కాదండోయ్!
-
WTC 2025-27: ఆస్ట్రేలియా టాప్, భారత్ 5వ స్థానం.. మిగిలిన 9 మ్యాచ్‌లు డూ ఆర్ డై..
-
Harish Rao: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్..
-
Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
ట్రెండింగ్
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!