Sachin Tendulkar: ట్యాప్ తిప్పాడు.. చిక్కుల్లో పడ్డాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sachin Tendulkar Trolled For Wasting Water While Cleaning Bat Grip: మాస్టార్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా జనాలకు సలహాలు ఇచ్చే సంగతి అందరికీ తెలిసిందే! దారిలో వెళ్తున్నప్పుడు ఎవరైనా హెల్మెట్ పెట్టుకోకపోతే, తన కారు అద్దాలు కిందకు దించి మరీ హెల్మెట్ పెట్టుకోవాలని సూచిస్తుంటాడు. ఇవే కాదు.. క్రికెట్‌కి సంబంధించిన చిట్కీలూ ఇస్తుంటాడు. తాజాగా ఆయన క్రికెట్ బ్యాట్ హ్యాండిల్‌ను, గ్రిప్‌ను ఎలా శుభ్రపరచుకోవాలో ఒక వీడియో ద్వారా చూపించాడు. బ్యాట్ గ్రిప్‌ను శుభ్రపరచుకోవడానికి ఇది తన స్పెషల్ మెథడ్ అంటూ ఆ వీడియోకి క్యాప్షన్ పెట్టాడు. ఇదంతా బాగానే ఉంది కానీ, ఒక్క విషయంలో మాత్రం సచిన్ అడ్డంగా దొరికిపోయాడు.
బ్యాట్‌ను క్లీన్ చేసేందుకు బాత్రూంలోని నీళ్ల ట్యాప్ తిప్పిన సచిన్.. దాన్ని అలాగే ఉంచేశాడు. దాంతో నీళ్లు చాలావరకు వృధా అయ్యాయి. ఆ వీడియోలో సచిన్ మాట్లాడుతున్నంతసేపు, నీళ్లు వృధాగా పోతూనే ఉన్నాయి. ఇదే సచిన్‌ని చిక్కుల్లో పడేసింది. ఎన్నో విషయాలపై సూచనలు ఇచ్చే సచిన్.. నీళ్లను వృధా చేయకూడదన్న సంగతిని మరిచారా? అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. పైగా.. సచిన్ ప్రస్తుతం ముంబై సివిక్ బాడీ ‘సేవ్ వాటర్’ క్యాంపెయిన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. అందుకే, నీళ్లను వృధా చేయడంపైనే జనాలు ఫోకస్ పెట్టారు. ‘‘సార్, బ్యాట్ గ్రిప్‌ను ఎలా క్లీన్ చేయాలన్న విషయం బాగుంది కానీ, నీటిని రక్షించాలన్న మీ మాటలు మరిచిపోయారా? ‘సేవ్ వాటర్’ క్యాంపెయిన్‌కు మీరు బ్రాండ్ అంబాసిడర్ అన్న సంగతి గుర్తుందా?’’ అంటూ సచిన్‌పై కామెంట్లు చేశారు.
Also Read
- Vaibhav Sooryavanshi: పాపం వైభవ్ సూర్యవంశీ.. తొక్కేస్తున్న గౌతమ్ గంభీర్.. ఇదే సాక్ష్యం!
- IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
- Chief Selector: ఆ మాజీ ప్లేయర్‌కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
- Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
ఇదిలావుండగా.. ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో ఇండియా లెజెండ్స్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. ఈ సిరీస్‌లో భాగంగా ఆల్రెడీ సౌతాఫ్రికా లెజెండ్స్‌తో మ్యాచ్ జరగ్గా.. అందులో సచిన్ కేవలం 16 పరుగులకే ఔటయ్యాడు. అయితే.. తన అరుదైన లాఫ్టెడ్ షాట్‌తో మాత్రం ఆడియన్స్‌ను అలరించాడు. ఈ మ్యాచ్‌లో స్టువర్ట్ బిన్నీ విధ్వంసరమైన ఇన్నింగ్స్ ఆడటంతో.. సౌతాఫ్రికా లెజెండ్స్ జట్టుపై ఇండియా లెజెండ్స్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
తాజావార్తలు
-
TG SAFE: హైదరాబాద్‌లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Vaibhav Sooryavanshi: పాపం వైభవ్ సూర్యవంశీ.. తొక్కేస్తున్న గౌతమ్ గంభీర్.. ఇదే సాక్ష్యం!
-
CNAP Service: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నవంబర్ 1 నుంచి ఫోన్లలో కాలర్ పేరు ప్రత్యక్షం!
-
Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
-
Supreme Court: “మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు”.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!