Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ryan Rickelton Viral Video: క్రికెట్ మ్యాచ్‌లలో అభిమానులు తమ అభిమాన ఆటగాళ్లను ఉత్సాహపరిచేందుకు రకరకాల ప్లకార్డులు ప్రదర్శిస్తుంటారు. కొన్నిసార్లు అవి సరదాగా ఉంటే.. మరికొన్నిసార్లు ఆటగాళ్లనే పెను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. తాజాగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో ఇలాంటి ఆసక్తికర ఘటనే చోటుచేసుకుంది. దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ ర్యాన్ రికెల్టన్ను ఉద్దేశించి ఓ అభిమాని ప్రదర్శించిన ప్లకార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో రాసిన పదాలను చూసి రికెల్టన్ ఇచ్చిన రియాక్షన్ అభిమానులను నవ్విస్తోంది.
ర్యాన్ రికెల్టన్.. మీ అమ్మ సింగిలా?:
కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ మైదానంలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు జరుగుతోంది. గురువారం మూడో రోజు ఆటలో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సమయంలో కూపర్ కొన్నోలీ, మిచెల్ స్టార్క్ బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో జెరాల్డ్ కోట్జీ బౌలింగ్ చేస్తుండగా.. బ్రాడ్ కాస్టింగ్ కెమెరా ఓ అభిమానిపై పడింది. అతడు చేతిలో పట్టుకున్న ప్లకార్డుపై ‘ర్యాన్ రికెల్టన్.. మీ అమ్మ సింగిలా?’ అని రాసి ఉంది. ఈ ఘటన స్టేడియంలో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. రికెల్టన్కు ముందుగా ఈ విషయం తెలియలేదు. సహచర ఆటగాళ్లు పెద్ద స్క్రీన్ వైపు చూడాలని అతడికి సూచించారు. స్క్రీన్‌పై తనను ఉద్దేశించి అభిమాని పట్టుకున్న ప్లకార్డును చూసిన రికెల్టన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. మరోవైపు ఆ అభిమాని కూడా కెమెరాలో కనిపించడంతో ఫ్లయింగ్ కిస్ ఇస్తూ మరింత సందడి చేశాడు.
Also Read
- AFG vs ZIM: 5 పరుగులకే 4 వికెట్లు.. ఆ తర్వాత ఒమర్జాయ్ సిక్సర్ల సునామీ.. కట్ చేస్తే ప్రపంచ రికార్డ్ సొంతం.!
- Rashid Khan History: టీ20ల్లో 'కింగ్'.. తొలి బౌలర్‌గా రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు!
- India vs New Zealand: ఈడెన్ పార్క్‌లో టీమిండియా అజేయ రికార్డు.. 100% విజయాలతో భారత్ హవా!
- IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!
రికెల్టన్ రియాక్షన్ వైరల్:
అభిమాని ప్లకార్డును చూసిన ర్యాన్ రికెల్టన్ తల అడ్డంగా ఊపుతూ నవ్వు ఆపుకోలేకపోయాడు. అతడి ముఖంలో కనిపించిన హావభావాలు అభిమానులను ఆకట్టుకుంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. క్రికెట్ మ్యాచ్ మధ్యలో జరిగిన ఈ సరదా సంఘటన నెటిజన్లకు మంచి వినోదాన్ని అందించింది. మరోవైపు ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రికెల్టన్ 83 బంతుల్లో 42 పరుగులు చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 329 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు డర్బన్‌లో జరిగిన తొలి టెస్టులో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రికెల్టన్.. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సున్నా, రెండు పరుగులకే పరిమితమయ్యాడు. దీంతో రెండో టెస్టులో బ్యాటింగ్ స్థానాన్ని మార్చారు.
స్టంప్స్ ముందుకు వచ్చి కీపింగ్ చేయడంపై ఆసక్తి:
మూడో టెస్టుకు ముందు ఆస్ట్రేలియా బ్యాటర్లకు స్టంప్స్‌కు దగ్గరగా నిలబడి వికెట్ కీపింగ్ చేయడం ఒక ఆసక్తికరమైన సవాలని రికెల్టన్ పేర్కొన్నాడు. వికెట్ కీపర్ స్టంప్స్‌కు దగ్గరగా నిలబడటం బ్యాటర్ ఆలోచనా విధానాన్ని మార్చుతుందని వివరించాడు. ఈ తరహా కీపింగ్ వల్ల బౌలర్ బంతిని మరింత నేరుగా లేదా ఫుల్ లెంగ్త్‌లో వేయాల్సి వస్తుందా? లేక బ్యాటర్ బంతిని ఆడే విధానాన్ని మార్చుకుంటాడా? అనే విషయం తనకు పూర్తిగా తెలియదని చెప్పాడు. అయితే ప్రపంచ క్రికెట్లో ప్రస్తుతం ఈ విధానం ఒక ట్రెండ్‌గా మారుతోందని రికెల్టన్ అభిప్రాయపడ్డాడు.
South African fans have absolutely ZERO fear 😭😭
Bro really looked at Ryan Rickelton and asked him if his mom was single. 💀 The confidence to ask an international cricketer something like that in front of everyone is CRAZY. South African crowd banter is genuinely in a league of its own. 😂 https://t.co/5ozYN5A2mr
— Nervous90s (@Nrvs90s) October 29, 2026
తాజావార్తలు
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
Operation Firewall 2026: పాక్ ఏజెంట్లకు సహకారం.. బీహార్‌లో ఇద్దరిని అరెస్ట్ చేసిన ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం
-
School Holidays: అర్నబ్ తుఫాన్ ప్రభావం.. సెలవులు పొడిగించిన విద్యాశాఖ!
-
Bharat Mobility Expo 2027: కార్ల ప్రియులకు పండుగే.. భారత్ మొబిలిటీ ఎక్స్పో 2027 తేదీలు ఖరారు..!
-
AFG vs ZIM: 5 పరుగులకే 4 వికెట్లు.. ఆ తర్వాత ఒమర్జాయ్ సిక్సర్ల సునామీ.. కట్ చేస్తే ప్రపంచ రికార్డ్ సొంతం.!
ట్రెండింగ్
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!
-
World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!