Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl Royal Challengers Bangalore Lost The Match By 21 Runs Against Kolkata Knight Riders

RCB vs KKR: కేకేఆర్ చేతిలో ఘోరంగా ఓడిన ఆర్సీబీ

Published Date :April 26, 2023 , 11:30 pm
By NTV WebDesk
RCB vs KKR: కేకేఆర్ చేతిలో ఘోరంగా ఓడిన ఆర్సీబీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

Royal Challengers Bangalore Lost The Match By 21 Runs Against Kolkata Knight Riders: బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘోర పరాజయం చవిచూసింది. కేకేఆర్ నిర్దేశించిన 201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. ఆ లక్ష్యాన్ని ఛేధించలేకపోయింది. 179 పరుగులకే పరిమితం అయ్యింది. దీంతో.. కేకేఆర్ జట్టు 21 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆర్సీబీ బ్యాటర్లలో స్టాండిన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్కడే అర్థశతకంతో రాణించగా.. మిగతా వాళ్లందరూ చేతులెత్తేశారు. కొంతలో కొంత లామ్రోర్ పర్వాలేదనిపించాడంతే! స్టార్ బ్యాటర్లు సహా మిడిలార్డర్ కూడా చెత్త ప్రదర్శన కనబర్చడంతో.. ఆర్సీబీకి ఓటమి తప్పలేదు.

Ipl Ad

IPL Low Scores: ఐపీఎల్ చరిత్రలో నమోదైన 10 అత్యల్ప స్కోర్లు

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. జేసన్ రాయ్ (56) అర్థశతకంతో రాణించడం.. కెప్టెన్ నితీశ్ రానా (48) మెరుపు ఇన్నింగ్స్ ఆడటం.. చివర్లో రింకూ సింగ్ (18), డేవిడ్ వీస్ (12) విజృంభించడం.. కేకేఆర్ అంత భారీ స్కోరు చేయగలిగింది. ఇక 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. మొదట్లో విధ్వంసం సృష్టించింది. తొలి రెండు ఓవర్లలో 30 పరుగులు చేసింది. ఓవైపు డు ప్లెసిస్, మరోవైపు విరాట్ కోహ్లీ ఆ రెండు ఓవర్లలో ఎడాపెడా షాట్లతో చెలరేగారు. అది చూసి.. ఆర్సీబీ అత్యంత సునాయాసంగా 201 పరుగుల లక్ష్యాన్ని ఛేధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ.. ఇంతలోనే ఆర్సీబీకి పెద్ద ఝలక్ తగిలింది. 31 పరుగుల వద్ద ఓ భారీ షాట్ కొట్టబోయి.. డు ప్లెసిస్ క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆ వెంటనే షాబాజ్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. నేను కూడా నీ వెంటే వస్తానంటూ.. మ్యాక్స్‌వెల్ కూడా పెవిలియన్ చేరాడు.

Operation Kaveri: సూడాన్ నుంచి ఢిల్లీ చేరుకున్న 360 మంది భారతీయులు..

అప్పుడు లామ్రోర్‌తో కలిసి విరాట్ కోహ్లీ తన జట్టుని ముందుకు నడిపించాడు. ఆచితూచి ఆడుతూనే.. వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లతో చెలరేగిపోయాడు. అతనితో పాటు లామ్రోర్ సైతం మెరుపులు మెరిపించాడు. వీళ్లిద్దరు కలిసి నాలుగో వికెట్‌కి 55 పరుగులు జోడించారు. వీళ్ల ఆటతీరు చూసి.. చివరి దాకా ఇన్నింగ్స్ లాక్కొస్తారని, వీళ్లే జట్టుని గెలిపిస్తారనే ఆశలు ఆర్సీబీ అభిమానుల్లో చిగురించాయి. కానీ.. అంతలోనే ఆ ఆశలు ఆవిరైపోయాయి. లామ్రోర్ ఔటైన కొన్ని నిమిషాల్లోనే విరాట్ కోహ్లీ కూడా పోయాడు. అప్పటికే ఓటమి దాదాపు ఖరారైంది. దినేశ్ కార్తిక్ ఏమైనా మ్యాజిక్ చేస్తాడా? అని అనుకుంటే.. ఈసారి కూడా నిరాశపరిచాడు. ఇక చివర్లో వచ్చే బ్యాటర్ల పరిస్థితి ఏంటో తెలిసిందేగా!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • jason roy
  • kolkata knight riders
  • RCB vs KKR
  • Royal Challengers Bangalore
  • VIRAT KOHLI

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions