Site icon NTV Telugu

India Vs Sri Lanka: రోహిత్ శర్మ ముందు మరో మైలురాయి

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో మైలురాయిని అందుకోనున్నాడు. శ్రీలంకతో ఈనెల 12 నుంచి బెంగళూరు వేదికగా జరిగే రెండో టెస్టు ద్వారా రోహిత్ తన కెరీర్‌లో 400వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు. రోహిత్ ఇప్పటివరకు 44 టెస్టులు, 230 వన్డేలు, 125 టీ20లు ఆడాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ మొదట్లో వరుసగా విఫలం కావడంతో జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకోలేకపోయాడు. 2013లో ఓపెనర్ అవతారం ఎత్తినప్పటి నుంచి తిరుగులేకుండా దూసుకెళ్తున్నాడు.

మరోవైపు రోహిత్ శర్మ కెప్టెన్సీపై టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు. టెస్టుల్లో కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌తోనే రోహిత్ శ‌ర్మ ఆక‌ట్టుకున్నాడ‌ని, అత‌డు బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్ ప్లేసు మెంట్లను స‌రిగ్గా చేశాడ‌ని కొనియాడాడు. బౌలింగ్‌లో ర‌వీంద్ర జ‌డేజాకు రోహిత్ శ‌ర్మ స‌రైన స‌మ‌యంలో బాల్ ఇచ్చాడ‌ని గ‌వాస్కర్ అభిప్రాయ‌ప‌డ్డాడు. దీంతో టీమిండియా మ‌రో రెండు రోజులు మిగిలి ఉండగానే మ్యాచ్ గెలిచింద‌న్నాడు. దీంతో రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీకి సునీల్ గ‌వాస్కర్ 10 మార్కులకు 9.5 మార్కులు ఇచ్చాడు.

Exit mobile version