Rohir Sharma: దక్షిణాఫ్రికాతో ఇండోర్‌లో జరిగిన చివరి టీ20లో టీమిండియా పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్‌గా వెనుతిరిగాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో అతడు చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రోహిత్ డకౌట్‌గా వెనుతిరగడం ఇది 43వ సారి. దీంతో ఇంటర్నేషనల్ టీ20 ఫార్మాట్‌లో అత్యధిక సార్లు సున్నా స్కోరుకే అవుటైన ఆటగాడిగా చరిత్ర నెలకొల్పాడు. గతంలో ఐర్లాండ్ ఆటగాడు కెవిన్ ఓబ్రియన్ పేరుతో ఈ రికార్డు ఉండేది. అతడు 42 సార్లు డకౌట్ కాగా రోహిత్ ఆ రికార్డును ఇండోర్ టీ20లో అధిగమించాడు.
Read Also: Team India: టీ20 ప్రపంచకప్‌లో బుమ్రా స్థానంలో ఎవరు? రోహిత్ ఏమంటున్నాడు?
ఈ జాబితాలో మూడో స్థానంలో బంగ్లాదేశ్ ఆటగాడు ముష్ఫీకర్ రహీమ్ ఉన్నాడు. అతడు ఇప్పటివరకు అంతర్జాతీయ టీ20ల్లో 40 సార్లు డకౌట్ అయ్యాడు. నాలుగో స్థానంలో ఆప్ఘనిస్తాన్ ఆటగాడు మహ్మద్ నబీ ఉన్నాడు. నబీ ఇప్పటివరకు 39 సార్లు డకౌట్‌గా వెనుతిరిగాడు. ఐదో స్థానంలో పాకిస్థాన్ ఆటగాడు షాహిద్ అఫ్రిది ఉన్నాడు. అఫ్రిది ఖాతాలో 37 డకౌట్లు ఉన్నాయి. కాగా ఇండోర్ వన్డేలో దక్షిణాఫ్రికా గెలిచినా మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా దక్షిణాఫ్రికా ఆటగాడు రోసౌ నిలిచాడు. అతడు ఈ మ్యాచ్‌లో 48 బంతుల్లోనే సెంచరీ చేశాడు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును సూర్యకుమార్ యాదవ్ అందుకున్నాడు.