Site icon NTV Telugu

Rohit Sharma: రోహిత్‌ శర్మ భవిష్యత్‌ కార్యాచరణపై నీలినీడలు..

Rohit

Rohit

Rohit Sharma: ఆస్ట్రేలియా టూర్ లో టీమిండియా ఘోర వైఫల్యంతో సీనియర్‌ ప్లేయర్స్ కెరీర్ల మీద నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ పర్యటనలోనే రవిచంద్రన్‌ అశ్విన్‌ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. మరోవైపు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, రవీంద్ర జడేజాలా భవితవ్యం మీదా సుధీర్ఘ చర్చ కొనసాగుతుంది. ఈ ముగ్గురూ టెస్టులకు గుడ్‌బై చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. అయితే ఆస్ట్రేలియాలో ఉండగానే రోహిత్ శర్మ రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడని ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆ ప్రచారాన్ని అతను తోసిపుచ్చాడు.

Read Also: Nadendla Manohar: తెనాలి జనసేన కార్యాలయంలో భోగి మంటలు..

అయితే, రోహిత్ శర్మ మరి కొంత కాలం టెస్టుల్లో సారథిగా కొనసాగుతానని బీసీసీఐకి చెప్పినట్లు సమాచారం. ఆసీస్ పర్యటనపై బీసీసీఐ నిర్వహించిన సమీక్ష సమావేశంలో రోహిత్‌ ఈ విషయాన్ని తెలిపాడటా.. కానీ, ‘‘కొన్ని నెలలు’’ అనే చెప్పాడట. ఈలోపు కొత్త కెప్టెన్‌ ఎంపికపై కసరత్తు కొనసాగించాలని సూచనలు చేశాడని తెలుస్తుంది. భారత్‌ ఇంకో ఆరు నెలల పాటు టెస్టులు ఆడే అవకాశం లేదు. వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఛాంపియన్స్‌ ట్రోఫీలో టీమిండియాను రోహితే నడిపించనున్నాడు. ఆ తర్వాత ఐపీఎల్‌ స్టార్ట్ అవుతుంది. జూన్‌లో భారత్ ఇంగ్లాండ్‌ టూర్ కు వెళ్లనుంది.

Read Also: Bangladesh India Border Tensions: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో ఉద్రిక్తత

ఇక, రోహిత్‌ శర్మ తాజా వ్యాఖ్యలను బట్టి చూస్తే ఐదు టెస్టుల ఆ సిరీస్‌లో అతనే కెప్టెన్‌గా కొనసాగుతారు. ఆ సిరీస్‌ తర్వాత అతను వీడ్కోలు అవకాశం ఉంది. మరోవైపు రోహిత్‌ వారసుడిగా జస్ప్రీత్ బుమ్రాను ఎంపిక చేసే విషయంలో ఏకాభిప్రాయం రాలేదు. బుమ్రా తరచుగా ఫిట్‌నెస్‌ సమస్యలు ఎదుర్కోవడమే అందుకు ప్రధాన కారణం. వెన్నుముక్క గాయంతో దీర్ఘ కాలంగా బాధపడుతున్న బుమ్రా ఎంత కాలం టెస్టు కెరీర్‌ను పొడిగించుకోగలడన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఆసీస్ తో చివరి టెస్టులో వెన్ను నొప్పితో మధ్యలోనే బౌలింగ్‌కు దూరం కావడంతో సిరీస్‌ ఫలితం మీద తీవ్ర ప్రభావం చూపించింది. ఇక, ఛాంపియన్స్‌ ట్రోఫీకి కూడా అతను ఆడేది అనుమానంగా మారింది.

Exit mobile version