Rohit Sharma-Team India: అగార్కర్‌తో విభేదాలు.. గంభీర్‌పై అసంతృప్తి.. టీమిండియాలో లుకలుకలు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma ODI Future Focus Again: టీమిండియా సీనియర్ బ్యాటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే భవిష్యత్‌పై మరోసారి చర్చ మొదలైంది. ఇటీవల ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డేలో సెంచరీ చేసిన తర్వాత రోహిత్ తన రిటైర్మెంట్ ఆలోచనను మార్చుకున్నట్లు ఓ నివేదిక పేర్కొంది. ఈ క్రమంలో రోహిత్, బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మధ్య విభేదాలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను బీసీసీఐ అధికారికంగా ఇప్పటివరకు ధృవీకరించలేదు.
ఇంగ్లండ్ సిరీస్‌కు ముందు రోహిత్ శర్మ వన్డే కెరీర్‌పై బీసీసీఐ సెలెక్టర్లు చర్చించినట్లు సమాచారం. తొలి రెండు మ్యాచ్‌ల తర్వాత తన వన్డే భవిష్యత్‌పై ఆలోచిస్తానని రోహిత్ సెలెక్టర్లకు హామీ ఇచ్చారట. అయితే లార్డ్స్‌లో జరిగిన మూడో వన్డేలో అద్భుత సెంచరీ సాధించడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయని పలు నివేదికలు పేర్కొన్నాయి. ఈ ఇన్నింగ్స్ తర్వాత రోహిత్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పే ఆలోచనను మార్చుకున్నాడట. ఇదే సమయంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో రోహిత్‌కు విభేదాలు తలెత్తినట్లు కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా అగార్కర్‌ను చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి తొలగించాలని రోహిత్ కోరినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
Also Read
- Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
- IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
- World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో 'గ్రూప్ ఆఫ్ డెత్'గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
- Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
మరోవైపు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ జట్టు వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారనే విషయంలో కూడా రోహిత్ శర్మ తన అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు మరో నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) అధిపతి వీవీఎస్ లక్ష్మణ్‌కు టీమ్ మేనేజ్మెంట్లో మరిన్ని కీలక బాధ్యతలు అప్పగించారట. అయితే రోహిత్ వన్డే భవిష్యత్తుకు ఎలాంటి ప్రమాదం లేదని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. వెస్టిండీస్‌తో స్వదేశంలో జరగనున్న తదుపరి వన్డే సిరీస్‌కు కూడా అతడిని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం రోహిత్ వన్డే కెరీర్ సజావుగా సాగనుందట. అయితే రోహిత్ వన్డే భవిష్యత్, అగార్కర్‌తో విభేదాలపై వస్తున్న వార్తలకు బీసీసీఐ నుంచి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!