Site icon NTV Telugu

Rohit Sharma: కోహ్లీ రికార్డును దాటేసిన రోహిత్ శర్మ

సారథిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలి వన్డే సిరీస్‌లోనే రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్‌లో వన్డేల్లో విండీస్‌‌ను వైట్‌వాష్ చేసిన మొట్టమొదటి కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. తన తొలి వన్డే సిరీస్‌నే క్లీన్‌స్వీప్ చేయడమే కాకుండా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నెలకొల్పిన ఓ రికార్డును అధిగమించాడు. రోహిత్ ఇప్పటివరకు 13 వన్డేలకు కెప్టెన్సీ వహించగా 11 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది. దీంతో ఇండియా తరఫున కోహ్లీ నెలకొల్పిన 13 మ్యాచ్‌ల్లో 10 విజయాల రికార్డును రోహిత్ శర్మ దాటేశాడు. ఓవరాల్‌గా 13 మ్యాచ్‌ల్లో 12 విజయాలతో క్లైవ్ లాయిడ్ (వెస్టిండీస్), ఇంజమామ్ (పాకిస్థాన్) తొలి స్థానంలో ఉన్నారు.

అటు ఓ వన్డే సిరీస్‌లో వెస్టిండీస్‌లో వైట్ వాష్ చేయడం భారత్‌కు ఇదే తొలిసారి. స్వదేశంలో టీమిండియాకు ఇది 12వ వైట్‌వాష్‌ సిరీస్‌ కావడం విశేషం. టీమిండియా గడ్డపై ఇప్పటివరకు శ్రీలంక, న్యూజిలాండ్‌, జింబాబ్వే, ఇంగ్లండ్‌ జట్లు వైట్‌వాష్‌ అయ్యాయి. తాజాగా ఈ జాబితాలో వెస్టిండీస్‌ చేరింది. ఓవరాల్‌గా వెస్టిండీస్ జట్టుకు వన్డేల్లో ఇది 20వ వైట్ వాష్. కాగా 2014లో స్వదేశంలో శ్రీలంకతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను 5-0 తో టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేయడం చేసింది. మళ్లీ ఏడేళ్ల తర్వాత టీమిండియా స్వదేశంలో వన్డేల్లో ఒక జట్టును క్లీన్‌స్వీప్‌ చేసింది.

Exit mobile version