Site icon NTV Telugu

Team India: ఇంగ్లండ్ బయలుదేరిన టీమిండియా.. రోహిత్ శర్మ మిస్సింగ్

Team India

Team India

గత ఏడాది కరోనా కేసుల కారణంగా ఇంగ్లండ్‌లో టీమిండియా ఆడుతున్న టెస్టు సిరీస్‌ అర్ధంతరంగా ఆగిపోయింది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా నాలుగు టెస్టులు మాత్రమే జరిగాయి. ఐదో టెస్టు వాయిదా పడింది. ఈ టెస్టును ఈ ఏడాది నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాయిదా పడిన ఐదో టెస్టు ఆడేందుకు టీమిండియా గురువారం నాడు ఇంగ్లండ్ బయలుదేరి వెళ్లింది. సిరీస్ ఫలితాన్ని తేల్చే ఈ నిర్ణయాత్మక టెస్టు మ్యాచ్ జూలై 1 నుంచి ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనుంది.

అయితే టెస్టు జట్టు సారథి రోహిత్ శర్మ మాత్రం టీమిండియాతో కలిసి ఇంగ్లండ్ వెళ్లలేదు. అతడు కాస్త ఆలస్యంగా జట్టుతో కలవనున్నాడు. రోహిత్ శర్మకు ప్రస్తుతం గాయాల ఇబ్బందేమీ లేకపోయినా వ్యక్తిగత కారణంగా ఈ నెల 20న ఇంగ్లండ్ బయలుదేరనున్నాడు. విరాట్ కోహ్లీ స్థానంలో టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా గురువారం నాడు ఇంగ్లండ్ వెళ్లిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ, బుమ్రా, షమీ, పుజారా, జడేజా, శార్దూల్ ఠాకూర్, శుభ్‌మన్ గిల్, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడుతున్న భారత జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న రిషబ్ పంత్ కూడా ఈ సిరీస్ ముగిసిన తర్వాత ఇంగ్లండ్ వెళ్లనున్నాడు.

Exit mobile version