KL Rahul: టీ20 ప్రపంచకప్‌లో కేఎల్ రాహుల్ ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేస్తే టీమ్‌కు ఉపయోగకరంగా ఉంటుందని ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు సునీల్ గవాస్కర్ తనయుడు రోహన్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల ముగిసిన ఆసియా కప్‌లో ఆప్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ రాణించాడని.. టీ20 ప్రపంచకప్‌లో కూడా కోహ్లీని ఓపెనర్‌గా పంపితే ఇతర జట్లు జంకుతాయని రోహన్ గవాస్కర్ చెప్పాడు. భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్ నెం.3లోనే బ్యాటింగ్ చేయాలని, అదే పర్‌ఫెక్ట్ పొజిషన్ అని పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ కారణంగా సూర్యకుమార్ నాలుగు లేదా ఐదో స్థానాల్లో బ్యాటింగ్ చేయాల్సి వస్తుందని.. ఇది సరికాదన్నాడు. కేఎల్ రాహుల్ డౌన్ ఆర్డర్‌లో వస్తే దినేష్ కార్తీక్ లేదా అక్షర్ పటేల్ వంటి ఆటగాళ్లకు మనోధైర్యంగా కూడా ఉంటుందన్నాడు. జట్టు లోయరార్డర్ కూడా పటిష్టంగా ఉండే అవకాశం ఉందన్నాడు.
Read Also:Cellphone Thieves: సెల్ ఫోన్ దొంగల హడావిడి.. ఆరోజే భారీగా కొట్టేశారు
అటు ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ గణాంకాలు చాలా బాగున్నాయని.. అతడి సగటు 55-57గా ఉందని రోహన్ గవాస్కర్ వివరించాడు. స్ట్రైక్ రేట్ కూడా దాదాపు 160గా ఉందని.. అలాగే కోహ్లీ చివరి ఇన్నింగ్స్‌లో 122 పరుగులతో నాటౌట్ నిలిచి వాహ్ అనిపించాడని.. బహుశా ఓపెనింగ్‌ను చాలా బాగా ఇష్టపడతాడని ఈ గణాంకాలు చెబుతున్నాయని రోహన్ తెలిపాడు. సరైన సమయంలో కోహ్లీ తన ఫామ్ అందుకున్నాడని.. టీ20 ప్రపంచకప్ లాంటి మెగా ఈవెంట్ ముందు కోహ్లీ ఫామ్‌లోకి రావడం భారత్‌కు శుభసూచకమని పేర్కొన్నాడు. కోహ్లీ ఫామ్‌లో ఉంటే అతడిని ఆపడం ఎవరి తరం కాదని.. భారత్ కప్పు కొట్టడం పక్కా అని రోహన్ గవాస్కర్ అన్నాడు.
