Rishabh Pant Record: సిక్సర్‌తో సెంచరీ.. టాప్‌లో సచిన్.. రిషభ్ పంత్ స్థానం ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishabh Pant Century With a Six: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ టెస్టు క్రికెట్లో తన దూకుడు కొనసాగిస్తున్నాడు. ముఖ్యంగా విదేశీ గడ్డలపై చెలరేగుతూ.. పలు రికార్డులు బద్దలు కొడుతున్నాడు. వెల్లింగ్టన్లోని బేసిన్ రిజర్వ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పంత్ సెంచరీ బాదాడు. కివీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ వేసిన 146.5వ ఓవర్లో సిక్సర్ బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో టెస్టు క్రికెట్లో సిక్సర్‌తో సెంచరీ సాధించిన ఆటగాళ్ల జాబితాలో పంత్ తన స్థానాన్ని మెరుగుపర్చుకున్నాడు.
టెస్టుల్లో అత్యధికసార్లు సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్ ఏకంగా ఆరు సార్లు ఈ ఘనత సాధించగా.. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెన్ బారింగ్టన్, రిషభ్ పంత్ చెరో నాలుగు సార్లు సిక్సర్‌తో శతకం పూర్తి చేశారు. వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా మూడు సార్లు ఈ ఘనత అందుకున్నాడు. తాజా ఇన్నింగ్స్‌లో పంత్ సెంచరీని సిక్సర్‌తో చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలో నెట్టింట వైరల్ అయింది. 137 బంతుల్లో పంత్ సెంచరీ మార్క్ అందుకున్నాడు.
Also Read
- India vs Pakistan: బ్లైండ్ క్రికెట్ ఆసియా కప్ ఫైనల్లో రచ్చ.. పాక్ ఆటగాళ్లతో కలిసి అంపైర్ 'జెట్ క్రాష్' సంబరాలు
- Rishabh Pant: చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. SENA దేశాల్లో తొలి వికెట్ కీపర్‌గా అరుదైన ఘనత.. మరో రికార్డు కూడా బ్రేక్..!
- Team India: టెస్టు క్రికెట్లో 700కు పైగా స్కోర్లు.. భారత్ అన్నిసార్లు చేసిందా?.. టాప్ ప్లేస్ మాత్రం..!
- Kavya -Anirudh Reception: కావ్య-అనిరుధ్ గ్రాండ్ రిసెప్షన్.. సీఎం విజయ్ స్పెషల్ గిఫ్ట్.. రజనీ, కమల్ ఆప్యాయపు నవ్వులు..
మరోవైపు టెస్టుల్లో వికెట్ కీపర్‌గా అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలోనూ రిషభ్ పంత్ ముందుకు దూసుకొచ్చాడు. ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ 17 సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా.. జింబాబ్వేకు చెందిన ఆండీ ఫ్లవర్ 12 శతకాలతో రెండో స్థానంలో ఉన్నాడు. రిషబ్ పంత్ తొమ్మిది సెంచరీలతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు లెస్ అమెస్ ఎనిమిది సెంచరీలతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. వెల్లింగ్టన్లో సెంచరీ చేయడంతో అమెస్ రికార్డును అధిగమించాడు.
టెస్టు క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలోనూ రిషభ్ పంత్ తన సత్తా చాటుతున్నాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ 138 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా.. పంత్ 108 సిక్సర్లతో రెండో స్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్ 107 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఆడమ్ గిల్‌క్రిస్ట్ 100 సిక్సర్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. జాక్ కలిస్, క్రిస్ గేల్, టిమ్ సౌథీ తలో 98 సిక్సర్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. సిక్సర్ల విషయంలో పంత్ సాధించిన మరో ప్రత్యేకత ఏమిటంటే.. ప్రతి సిక్సర్‌కు తీసుకున్న బంతుల సగటు కేవలం 47.93 మాత్రమే. అంటే పంత్ తన దూకుడైన ఆటతీరుతో చాలా తక్కువ బంతుల్లోనే సిక్సర్లు బాదుతున్నాడు. మొత్తంగా ఈ అరుదైన రికార్డులతో టెస్టు క్రికెట్లో పంత్ తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నాడు.
తాజావార్తలు
-
Rishabh Pant Record: సిక్సర్‌తో సెంచరీ.. టాప్‌లో సచిన్.. రిషభ్ పంత్ స్థానం ఇదే!
-
BJP MP Ramrao Wadkute: 8 నెలల క్రితమే రాజ్యసభకు ఎంపిక.. బీజేపీ ఎంపీ గుండెపోటుతో మృతి
-
India vs Pakistan: బ్లైండ్ క్రికెట్ ఆసియా కప్ ఫైనల్లో రచ్చ.. పాక్ ఆటగాళ్లతో కలిసి అంపైర్ ‘జెట్ క్రాష్’ సంబరాలు
-
Rishabh Pant: చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. SENA దేశాల్లో తొలి వికెట్ కీపర్‌గా అరుదైన ఘనత.. మరో రికార్డు కూడా బ్రేక్..!
-
Team India: టెస్టు క్రికెట్లో 700కు పైగా స్కోర్లు.. భారత్ అన్నిసార్లు చేసిందా?.. టాప్ ప్లేస్ మాత్రం..!
ట్రెండింగ్
-
IND vs NZ Test: టీమిండియా బ్యాటర్ల ఊచకోత.. భారీ ఆధిక్యంలో భారత్..!
-
Kimchi Day : కిమ్చీ.. కొరియా వంటకం వెనుక ఆరోగ్య రహస్యం
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్‌తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!