NTV Telugu Site icon

Icc World Cup 2023 : భారత్ లో ఆడే ప్రసక్తి లేదు.. లంకలో అయితే ఓకే!

Ind Vs Pak

Ind Vs Pak

2023లో జరుగనున్న వన్డే ప్రపంచకప్ లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ను చూసే అవకాశం స్వదేశంలో క్రికెట్ అభిమానులకు లేనట్టేనా.. ప్రస్తుతం ఈ ప్రశ్న క్రికెట్ అభిమానుల మనసుల్లో మెదులుతూనే ఉంది. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తే అది కష్టమేనన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఐసీసీ షెడ్యూల్ ప్రకారం భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్, పాకిస్థాన్ లో ఆసియా కప్ టోర్నమెంట్ లు జరగాల్సి ఉంది.

Also Read : AP CM Jagan: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ

అయితే పాక్ లో ఆసియా కప్ ను నిర్వహిస్తే టీమ్ ఇండియా అక్కడికి రాదని బీసీసీఐ స్పష్టం చేసింది. పాక్ లో కాకుండా తటస్థ వేదికలపైనే తాము ఆడతామని బీసీసీఐ కార్యదర్శి జై షా ఇప్పటికే వెల్లడించారు. దాంతో పాక్ కూడా వన్డే ప్రపంచకప్ లో ఆడేది లేదని ఎప్పటి నుంచో స్పష్టం చేస్తూ వస్తుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పాక్ క్రికెట్ బోర్డు కూడా తమ నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది. కాకపోతే ప్రపంచ కప్ లో ఆడేందుకు వీరు ఓ కొత్త షరతులను పెట్టారు.

Also Read : VNR Trio: ఆ గన్నులు ఏంటి? బాణం ఏంటి? అసలు ఏం చేస్తున్నారు నితిన్ అన్న…

ఆసియా కప్ కొసం భారత్ తటస్థ వేదికలపైనే ఆడేందుకు ఎలా అయితే మొగ్గు చూపిందో.. పాక్ టీమ్ కూడా వన్డే వరల్డ్ కప్ లో కూడా తాము ఆడాల్సిన మ్యాచ్ లను బంగ్లాదేశ్ లేదా శ్రీలంక దేశాల్లోని మైదానాల్లో నిర్వహించాలంటూ షరతులు విధించినట్లు తెలుస్తోంది. ఓ వైపు అక్టోబర్-నవంబర్ లో జరుగనున్న వన్డే ప్రపంచ కప్ కోసం సన్నాహలు జరుగుతున్నాయి. అయినప్పటికీ
ఐసీసీ ఇప్పటి వరకు పూర్తి స్థాయి షెడ్యూల్ ను వెల్లడించలేదు.. ఈ క్రమంలో కొత్త షరతులతో పాక్ క్రికెట్ బోర్డు ముందుకు రావడం ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది. అయితే ఐసీసీ, బీసీసీఐ మాత్రం దీనికి ఒప్పుకోవడం కష్టమేనని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Also Read : Sri Rama Pattabhishekam: నేడు భద్రాద్రిలో శ్రీరామ పట్టాభిషేకం.. పోటెత్తిన భక్తజనం

ఒకవేళ బీసీసీఐ తమ జట్టును ఆసియా కప్ కోసం పాక్ కు పంపించకపోతే మేము కూడా ప్రపంచకప్ మ్యాచ్ ల కోసం భారత్ కు వచ్చే అవకాశం లేదు.. మా మ్యాచ్ లను కూడా తటస్థ వేదికలపైనే నిర్వహించాలి.. ఇదే మా షరతు అని పీసీబీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఆసియా కప్ మ్యాచ్ ల షెడ్యూల్ పై తుది నిర్ణయం వెలువడితేనే ఈ ప్రపంచకప్ సమస్యకూ తెరపడే అవకాశాలు ఉన్నాయి. అయితే పాకిస్థాన్ జట్టు భారత్ కు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిన అసవరం ఉంది. అలాగే భద్రతరీత్యా దాయాది దేశానికి వెళ్లేందుకు మాత్రం టీమిండియాకు భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వడం దాదాపు అసాధ్యం.