ఐపీఎల్ పై కన్నేసిన రిలయన్స్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రసార హక్కులపై రిలయన్స్ కన్నేసిందా ? డిసెంబర్లో జరిగే బిడ్డింగ్‌లో పాల్గొని…బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్ దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందా ? ఇప్పటికే అందుకు కావాల్సిన మ్యాన్ పవర్‌ను సిద్ధంగా చేసిందా
ఇండియాలో…ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఐపీఎల్ ప్రారంభమవుతుందంటే….ప్రధాన నగరాల్లో ఉండే ఆ జోష్ వేరు. షెడ్యూల్ వచ్చింది మొదలు…సీజన్ ముగిసే వరకు…క్రికెట్ ఫ్యాన్స్‌కు మ్యాచ్‌ల గురించే చర్చ. అభిమానుల ఆసక్తిని క్యాష్ చేసుకునేందుకు…రిలయన్స్ సంస్థ పెద్ద ప్రణాళికే రచించింది. ముంబై ఇండియన్స్‌ను కొనుగోలు చేసి…క్రీడారంగంలోకి ప్రవేశించింది. తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్…ప్రసార హక్కులపై కన్నేసింది.
Also Read
- Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
- Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
- Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
- Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్‌కు బెయిల్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రసార హక్కులు దక్కించుకొనేందుకు రిలయన్స్ భారీ ప్రణాళికతో రానుందని తెలిసింది. ఇప్పటికే ప్రత్యర్థి బ్రాడ్‌కాస్టింగ్ సంస్థల నుంచి సీనియర్లను తీసుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఆఖర్లో నిర్వహించే ఐపీఎల్ బిడ్డింగ్‌లో పాల్గొని…ప్రసార హక్కులను ఎలాగైనా గెలుచుకోవాలని పట్టుదలతో ఉంది. ఐపీఎల్ బ్రాడ్ కాస్టింగ్‌ను స్టార్‌స్పోర్ట్స్ ఐదేళ్ల పాటు కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. ఈ ఏడాదితో ఐపీఎల్ బ్రాడ్ కాస్టింగ్ కాంట్రాక్ట్ ముగియనుంది. దీంతో ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. నెట్వర్క్ గ్రూప్-18, రిలయన్స్ జియో భాగస్వామ్యంతో ఐపీఎల్ మ్యాచ్‌లను బ్రాడ్ కాస్టింగ్ హక్కులను పొందాలని రిలయన్స్ భావిస్తోంది.
ప్రస్తుతం ఐపీఎల్ ప్రసార హక్కులు డిస్నీ స్టార్ ఇండియా వద్ద ఉన్నాయి. 2022తో ఒప్పందం ముగుస్తుంది. బిడ్డింగ్స్ ద్వారా కొత్త ప్రక్రియ ఈ ఏడాది ఆఖర్లో ఆరంభమవుతుంది. డిస్నీ స్టార్, సోనీ పిక్చర్స్ నెట్వర్క్, అమెజాన్ ఇండియా సైతం హక్కుల కోసం భారీ స్థాయిలో పోటీ పడనున్నాయి. రిలయన్స్ నుంచి సరికొత్త క్రీడా ఛానల్ రాబోతోందని ఈ4ఎం చెబుతోంది. ఇప్పటికే ఫుట్‌బాల్ లీగ్ ‘లా లిగా’ ప్రసార హక్కుల్లో వయాకామ్ మెజారిటీ వాటా దక్కించుకొందని గుర్తు చేస్తోంది.
తాజావార్తలు
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!