Reliance Jio: భారీ అంచనాల నడుమ ఫిఫా ప్రపంచకప్ ఎంతో ఘనంగా ప్రారంభమైంది. ఈ మెగా టోర్నీ ప్రసార హక్కులను రిలయన్స్ సంస్థకు చెందిన వయాకామ్ 18 దక్కించుకుంది. దీంతో వయాకామ్ 18, వూట్ యాప్, జియో సినిమా యాప్ ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. వూట్ యాప్ ఈ మ్యాచ్‌లను చూడాలంటే అభిమానులు రూ.599తో సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. దీంతో ఫుట్‌బాల్ అభిమానులు జియో సినిమా యాప్‌ను ఆశ్రయిస్తున్నారు. కానీ అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ప్రతి సెకనుకు వీడియో ఆగిపోతూ లోడ్ అవుతోందని దీంతో మ్యాచ్ చూడలేకపోయామని అభిమానులు వాపోతున్నారు. దీంతో జియో యాప్‌ను నెటిజన్‌లు ట్రోల్ చేస్తున్నారు. 2005లో ఇంటర్నెట్ ఎక్స్‌పోరర్ కంటే దారుణంగా లోడ్ కావడం సిగ్గుచేటు అని వాపోతున్నారు.
Read Also: Teodoro Obiang: 43 ఏళ్లుగా ఒకే ఒక్కడు.. మళ్లీ అతనికే అవకాశం
కాగా ఫిఫా ప్రపంచకప్‌లో ఆదివారం ఈక్వెడార్, ఖతార్ మధ్య మ్యాచ్ జరగ్గా.. ఈక్వెడార్ కెప్టెన్ ఎన్నెర్ బంతి దగ్గరికి రాగానే లైవ్ స్ట్రీమింగ్ ఆగిపోయింది. ఐదు సెకన్ల తర్వాత లోడ్ అయ్యింది. స్కోరు బోర్డులో గోల్ చేరింది కానీ అలా ఎలా వచ్చింది మాత్రం జియో సినిమాలో మ్యాచ్ చూసే ప్రేక్షకులకు కనిపించలేదు. వీడియో లోడ్ అవుతుంటే ఈ మ్యాచ్‌లు చూడకపోవడమే బెటర్ అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం విషయంలో జియో అట్టర్ ఫ్లాప్ అయిందని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ సైతం జియో సినిమా యాప్‌లోనే లైవ్ స్ట్రీమింగ్ కానుంది. కొన్నేళ్లుగా హాట్ స్టార్ యాప్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను చూసిన అభిమానులకు ఇది మింగుడుపడని విషయమే. కాగా ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్ చూస్తుంటే వీడియో బఫరింగ్ అవుతుందని జియో సినిమాపై ట్విటర్‌లో అభిమానులు ట్రోల్స్ చేస్తుండగా జియో సినిమా మాత్రం క్షమాపణలు కోరింది.
