BCCI Revenue: ఆర్ఆర్, ఆర్‌సీబీల భారీ డీల్‌లు.. బీసీసీఐకి ఎన్ని కోట్ల లాభమో తెలుసా?
- ఆర్ఆర్, ఆర్‌సీబీల భారీ డీల్‌లు
- ఐపీఎల్ 2026 అనంతరం కొత్త యాజమాన్యం చేతుల్లోకి
- బీసీసీఐకి ఎన్ని కోట్ల లాభమో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) ఫ్రాంచైజీల విక్రయాలతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మరోసారి తన ఆర్థిక శక్తిని ప్రపంచానికి చూపింది. ఆర్ఆర్‌ను రూ.15,300 కోట్లకు ప్రముఖ టెక్ వ్యాపారవేత్త కల్ సోమని నేతృత్వంలోని కన్సార్షియం కొనుగోలు చేసింది. రూ.16,706 కోట్లకు ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా, బోల్ట్ వెంచర్స్, బ్లాక్‌స్టోన్ సంస్థలు ఆర్‌సీబీని కైవసం చేసుకున్నాయి. ఈ ఒప్పందాలకు బీసీసీఐ, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. ఐపీఎల్ 2026 అనంతరం ఆర్ఆర్, ఆర్‌సీబీలు కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
ఆర్ఆర్, ఆర్‌సీబీ ప్రాంచైజీల భారీ డీల్‌ల కారణంగా భారత క్రికెట్ మండలి (బీసీసీఐ)కి భారీ ఆదాయం రానున్నట్లు తెలుస్తోంది. రెండు జట్ల అమ్మకాల ద్వారా బీసీసీఐ దాదాపు 170 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1,570 కోట్లు) ట్రాన్స్‌ఫర్ ఫీజుల రూపంలో పొందనుందని సమాచారం. ఆర్ఆర్, ఆర్‌సీబీల మొత్తం డీల్ విలువ సుమారు 3.4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.32,000 కోట్లు)గా ఉంది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందాల్లో ఒకటిగా నిలిచింది. ఈ డీల్‌లలో ముఖ్యమైన అంశం ఏంటంటే.. 5 శాతం ట్రాన్స్‌ఫర్ క్లాజ్. ఫ్రాంచైజీలు యాజమాన్యం మారినప్పుడు ఆ మొత్తం విలువలో 5 శాతం బీసీసీఐకి వెళ్లే విధంగా నిబంధన అమల్లో ఉంది. ఈ క్లాజ్ కారణంగా బోర్డుకు అదనంగా భారీ ఆదాయం లభిస్తోంది.
Also Read
- Sahibzada Farhan: అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు.. పాకిస్థాన్ కొత్త కెప్టెన్ వీర విహారం..
- Jasprit Bumrah: బుమ్రా లేని టీమిండియా.. 250 రన్స్ చేసినా ఓటమి.. అసలు లోపం ఎక్కడుంది?
- WTC Points Table 2026: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఆసీస్.. భారత్ ప్లేస్ ఎక్కడో తెలుసా?
- IND Vs WI 4th T20: ఉప్పల్‌లో 300 పరుగుల లోడింగ్..! సాధ్యసాధ్యాలివే..
Also Read: IPL Owners List 2026: 10 ఐపీఎల్ జట్ల యజమానులు ఎవరో తెలుసా?.. ఫ్రాంచైజీల వెనుక ఉన్న పెద్ద పేర్లు ఇవే!
ఇటీవలి కాలంలో ఐపీఎల్ గ్లోబల్ స్పోర్ట్స్ మార్కెట్‌లో అత్యంత విలువైన లీగ్‌లలో ఒకటిగా ఎదిగిన నేపథ్యంలో.. ఇలాంటి భారీ డీల్‌లు సాధారణంగా మారుతున్నాయి. ఫ్రాంచైజీల బ్రాండ్ విలువ, అభిమానుల ఆదరణ, మీడియా హక్కుల ద్వారా వచ్చే ఆదాయం.. అన్ని కలిపి ఐపీఎల్‌ను బంగారు గనిగా మార్చేశాయి. మొత్తంగా ఈ తాజా ఒప్పందాలు బీసీసీఐకి మాత్రమే కాదు.. భారత క్రికెట్ ఆర్థిక వ్యవస్థకు కూడా భారీ ఊతం ఇస్తున్నాయి. భవిష్యత్తులో మరిన్ని ఫ్రాంచైజీ డీల్‌లు, పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
-
Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
-
Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
-
Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
-
Emraan Hashmi Accident: ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. పల్టీ కొట్టిన కారు..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..