ఐపీఎల్ 2022 సీజన్‌లో ఈ రోజు మరో ఆసక్తికర పోటీ జరుగనుంది. నాలుగు విజయాలతో దూసుకుపోతున్న ఎస్‌ఆర్‌హెచ్ పట్టిష్టమైన ఆర్సీబీతో తలపడనుంది. ముంబైలోని బ్రబోర్న్ వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిని ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్‌ను ఎంచుకుంది. దీంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 68 పరుగులకే కుప్పకూలి అందరినీ షాక్‌కు గురిచేసింది. బౌలర్లు జానెసన్, నటరాజన్‌లు ఆర్‌సీబీ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. జానెసన్, నటరాజన్ చెరో మూడు వికెట్లు సాధించగా, సుచిత్ రెండు, ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ కుమార్ తలా వికెట్ సాధించారు. ఆర్‌సీబీ బ్యాటర్లలో సుయాష్ ప్రభుదేసాయి 15 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.