Site icon NTV Telugu

వైరల్… ‘పుష్ప’ డైలాగ్ చెప్పిన టీమిండియా క్రికెటర్

ప్రస్తుతం ఎక్కడ చూసినా అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా ఫీవర్ నడుస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ‘తగ్గేదే లే’ అనే డైలాగ్ తెగ వైరల్ అవుతోంది. ఈ డైలాగ్ టీమిండియా క్రికెటర్లను కూడా ఆకట్టుకున్నట్లు కనిపిస్తోంది. తాజాగా టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మాసిన గడ్డంతో ‘పుష్ప’ లుక్‌లో కనిపిస్తూ… ‘పుష్ప.. పుష్పరాజ్.. నీ యవ్వ తగ్గేదే లే’ అంటూ డైలాగ్ చెప్పడం ఐకాన్ స్టార్ అభిమానులను అలరిస్తోంది.

ప్రస్తుతం రవీంద్ర జడేజా షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పుష్ప టీమ్ కూడా జడేజా వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసింది. హీరో అల్లు అర్జున్ కూడా జడేజా చేసిన పోస్ట్ పట్ల స్పందించాడు. సూపర్ అంటూ ఎమోజీని బన్నీ షేర్ చేశాడు. మరోవైపు ఇప్పటికే ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా ‘పుష్ప’ సినిమాలోని ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా అనే పాటను అనుకరిస్తూ షేర్ చేసిన వీడియోకు అద్భుత స్పందన లభించిన సంగతి తెలిసిందే.

Exit mobile version