Ravichandran Ashwin: చరిత్ర సృష్టించిన అశ్విన్.. ఆ ఘనత సాధించిన తొలి భారత బౌలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravichandran Ashwin Creates Sensational Record: భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తాజాగా అరుదైన ఘనత సాధించాడు. స్వదేశంలో టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక ఐదు వికెట్ల హాల్స్ సాధించిన బౌలర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లోని తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు సాధించడంతో.. అశ్విన్ ఈ రికార్డ్‌ను తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డ్ భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. భారత గడ్డపై ఆయన టెస్టుల్లో 25 సార్లు ఐదు వికెట్ల హాల్స్ నమోదు చేశారు. ఇప్పుడు తాజా మ్యాచ్‌తో 26వ సారి 5 వికెట్ల హాల్ సాధించి, కుంబ్లే రికార్డ్‌ని అశ్విన్ బద్దలు కొట్టాడు. ఓవరాల్‌గా అశ్విన్‌కి ఇది 32వ ఐదు వికెట్ల హాల్ కావడం విశేషం. ఇదే సమయంలో అశ్విన్ మరో సంచలన రికార్డ్‌ని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్‌గా అశ్విన్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు 111 వికెట్లతో అనిల్ కుంబ్లే పేరిట ఆ రికార్డ్ ఉండగా.. 113 వికెట్లతో అశ్విన్ ఆ రికార్డ్‌ని పటాపంచలు చేశాడు. భారత బౌలర్లలో ఈ ఇద్దరు మినహా మరెవ్వరు ఆస్ట్రేలియాపై 100 వికెట్లకు మించి తీయలేదు.
Dolo 650: డోలో 650 తయారీ సంస్థకు క్లీన్ చీట్ ఇచ్చిన ఫార్మా అసోసియేషన్.. కానీ..
Also Read
- IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు 480 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(180), కామెరాన్ గ్రీన్(114) సెంచరీలతో చెలరేగడం వల్లే.. ఈ జట్టు ఇంత భారీ స్కోర్ చేయగలిగింది. టాడ్ మర్ఫీ సైతం 41 పరుగులతో ఆకట్టుకున్నాడు. భారత బౌలర్ల విషయానికొస్తే.. అశ్విన్ ఆరు వికెట్లతో చెలరేగగా, మహమ్మద్ షమీ రెండు వికెట్లు, రవీంద్ర జడేజా & అక్షర్ పటేల్ చెరో వికెట్ తీసుకున్నారు. ప్రస్తుతం భారత జట్టు బ్యాటింగ్ చేస్తోంది. రెండో రోజు ఆటను ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 36 పరుగులతో ముగించింది.
Huge Train: అబ్బో ఎంత పెద్ద రైలో దీన్ని లాగాలంటే నాలుగైదు ఇంజన్లు కావాల్సిందే
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు