Ravichandran Ashwin Again Gains No 1 Spot In ICC Test Rankings: స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023 సిరీస్‌లో కొందరు టీమిండియా ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనలు కనబర్చడంతో.. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానాల్ని ఆక్రమించుకున్నారు. రవిచంద్రన్ అశ్విన్ అయితే మరోసారి నంబర్ వన్ బౌలర్‌గా అవతరించాడు. ఈ సిరీస్‌లో అతడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మొత్తంగా 25 వికెట్లు తీయడంతో పాటు 86 పరుగులు సాధించాడు. ఫలితంగా.. అతనికి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డ్ లభించింది. ఈ సిరీస్ నేపథ్యంలో.. అశ్విన్ తొలుత ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్‌ని వెనక్కు నెట్టి నంబర్1 బౌలర్‌గా నిలిచాడు. అయితే.. మధ్యలో కొన్ని పాయింట్లు కోల్పోవడంతో, అండర్సన్‌తో కలిసి అంగ్రస్థానాన్ని సంయుక్తంగా పంచుకున్నాడు. కానీ.. చివరి టెస్టులో 7 వికెట్లు తీయడంతో.. అండర్సన్ కన్నా 10 పాయింట్లు ఎక్కువ సంపాదించి, నంబర్ వన్ ర్యాంక్‌ని తిరిగి కైవసం చేసుకున్నాడు.
Air Hostess Archana: వీడిన ఎయిర్‌హోస్టెస్ మృతి మిస్టరీ.. అతడే చంపేశాడు
ఇదే సిరీస్‌లో భాగంగా చివరి టెస్ట్ మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (186) శకతం సాధించడంతో.. ర్యాంకింగ్స్‌లో ఏకంగా ఎనిమిది స్థానాలు ఎగబాకాడు. తద్వారా.. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 13వ ర్యాంక్ సాధించాడు. కోహ్లీకి టెస్టుల్లో ఇది 28వ సెంచరీ కాగా.. ఓవరాల్‌గా 75వ శతకం. బ్యాటింగ్ విభాగంలో.. కోహ్లి కంటే ముందు వరుసలో రిషభ్ పంత్ 9, రోహిత్ శర్మ 10వ ర్యాంకుతో టాప్-10లో కొనసాగుతుండగా.. ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ అగ్రస్థానంలో ఉన్నాడు. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కూడా బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 44వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఈ సిరీస్‌లో అతడు తన బ్యాట్‌తో మెరుగైన ఇన్నింగ్స్‌లే ఆడాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో చూసుకుంటే.. నాలుగో స్థానాన్ని అక్షర్ ఆక్రమించాడు.
Boora Narsaiah: తెలంగాణలో ఢిల్లీని మించిన లిక్కర్ స్కామ్ జరిగింది.. త్వరలోనే ఆధారాలతో..