Site icon NTV Telugu

Hardik Pandya: స్టోక్స్ బాటలో హార్డిక్ పాండ్యా.. టీమిండియాకు షాక్ ఇస్తాడా?

Hardik Pandya

Hardik Pandya

ravi shastri sensational comments on hardik pandya: ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఇటీవల అనూహ్య రీతిలో వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఇప్పుడు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ కూడా వన్డేలకు గుడ్‌బై చెప్తాడని మాజీ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది ఇండియాలో జరగనున్న వన్డే ప్రపంచ కప్ తర్వాత వన్డేల నుంచి హార్డిక్ పాండ్యా తప్పుకునే అవకాశం ఉందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. పాండ్యా వన్డేలను వదిలేసి కేవలం టీ20లకే పరిమితమయ్యే అవకాశం ఉందన్నాడు. భవిష్యత్‌లో చాలా మంది ఆటగాళ్లు కూడా వన్డేలను వదిలేసి కేవలం టీ20లకే పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని రవిశాస్త్రి అన్నాడు.

Read Also: World Athletics Championship: చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. 19 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం

మరోవైపు టెస్ట్ క్రికెట్ రోజురోజుకు ఆదరణ కోల్పోతుందని రవిశాస్త్రి ఆరోపించాడు. వన్డేలు, టీ20ల కంటే టెస్ట్ క్రికెట్ చాలా ప్రత్యేకం అయినప్పటికీ సుదీర్ఘ ఫార్మాట్ ఆడాలని క్రికెటర్లు కోరుకోవడం లేదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆటగాళ్లు ఏయే ఫార్మాట్లలో ఆడాలో వారే నిర్ణయించుకుంటున్నారని పేర్కొన్నాడు. అంతేకాకుండా టెస్ట్ క్రికెట్‌పై అభిమానుల్లో ఆసక్తి తగ్గిపోతోందని.. టెస్ట్ క్రికెట్‌లో జట్ల సంఖ్యను ఆరుకు తగ్గించేలా ఐసీసీ చర్యలు తీసుకోవాలని రవిశాస్త్రి డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

Exit mobile version