NTV Telugu Site icon

Rashid Latif: రెస్ట్ ఇన్ పీస్ పాకిస్తాన్ క్రికెట్.. మాజీ క్రికెటర్ సంచలనం

Pakistan Rest In Peace

Pakistan Rest In Peace

Rashid Latif Makes Sensational Comments On Pakistan Cricket Board For Changing Players: ఈమధ్య పాకిస్తాన్ క్రికెట్ బోర్డు జట్టులో రకరకాల మార్పులు చేస్తోంది. ఇప్పటికే ఇప్పటికే అఫ్గానిస్తాన్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు.. బాబర్‌ ఆజం స్థానంలో షాదాబ్‌ ఖాన్‌ను కెప్టెన్‌గా నియమించింది. అంతేకాదు.. బాబర్‌తో పాటు షాహిన్‌ అఫ్రిది, ఫఖర్‌ జమాన్‌, హారిస్‌ రవూఫ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌ వంటి హేమాహేమీ ఆటగాళ్లను విశ్రాంతి పేరుతో పక్కనపెట్టింది. పాక్ జట్టుని కొత్తగా, పటిష్టంగా తయారు చేయాలన్న ఉద్దేశంతో.. పాక్ బోర్డు ఈ కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. అయితే.. ఈ మార్పులకు కొందరు మద్దతు తెలుపుతుంటే, మరికొందరు మాజీలు మాత్రం వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. మాజీ క్రికెటర్‌ రషీద్‌ లతీఫ్‌‌కి సైతం ఈ మార్పులు నచ్చలేదు. ఈ క్రమంలోనే ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్‌ జట్టు ఇప్పుడు రెస్ట్‌ ఇన్‌ పీస్‌ మోడ్‌లో ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Hyderabad Crime: భార్యని నరికి, పసికందును సంపులో వేసి.. భర్త పరార్

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో, అవార్డులు గెలుచుకోవడంలో పాకిస్తాన్ ఆటగాళ్లు కొంతకాలం నుంచి ముందుంటున్నారని.. ముఖ్యంగా బాబర్‌ ఆజం, షాహిన్‌ అఫ్రిదిలు గతేడాది ఐసీసీ అవార్డులను సొంతం చేసుకున్నారని రషీద్ పేర్కొన్నాడు. అయితే.. వాళ్లు ఇలా అవార్డులు పొందడం పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి నచ్చలేదని.. అందుకే తమకు నచ్చనివారిపై వేటు వేసేలా నిర్ణయాలు బోర్డు మెంబర్లు తీసుకుంటున్నారని మండిపడ్డాడు. విశ్రాంతి పేరుతో ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను పక్కన పెట్టడమేంటని ప్రశ్నించాడు. బోర్డులో 70, 80 ఏళ్ల వయసులో ఉన్న సభ్యులు.. రెస్ట్ తీసుకోవాల్సిన సమయంలో అజమాయిషీ చెలాయిస్తూ, పాక్ క్రికెట్‌ని మార్చాలనుకుంటున్నారని ఆరోపణలు చేశాడు. అందుకే.. ఇప్పుడు పాక్ క్రికెట్ ‘రెస్ట్‌ ఇన్‌ పీస్‌’లో ఉందని చెప్పగలనన్నాడు. కొత్త ప్లేయర్లకు అవకాశం ఇవ్వడం మంచిదే కానీ.. మొత్తం జట్టునే ప్రక్షాళన చేయాలనుకోవడం మూర్ఖత్వం కిందకు వస్తుందని ఫైర్ అయ్యాడు. పాకిస్తాన్‌ క్రికెట్‌ టీమ్‌ నాశనానికి ఇదే తొలి అడుగులా కనిపిస్తోందంటూ కుండబద్దలు కొట్టాడు.

KS Bharath: కేఎస్ భరత్ వద్దు.. అతడే సరైనోడు.. టీమిండియా దిగ్గజం సంచలన వ్యాఖ్యలు