ఆఫ్ఘానిస్తాన్ యువ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన పేరిట మరో రికార్డును క్రియేట్ చేసాడు. టీ20 క్రికెట్ లో 400 వికెట్లు సాధించిన నాల్గవ బౌలర్ గా నిలిచిన రషీద్ ఆ మార్క్ ను అతి తక్కువ మ్యాచ్ లలో అందుకున్న మొదటి బౌలర్ గా నిలిచాడు. ఈరోజు ఐసీసీ టీ20
ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో రషీద్ వేసిన తొమ్మిదో ఓవర్‌లో కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్‌ను బౌల్డ్ చేయడంతో ఈ 23 ఏళ్ల స్పిన్నర్ ఆ మైలురాయిని చేరుకున్నాడు. అయితే రషీద్ తన 289వ టీ20 మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఇక అంతకముందు 364 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా డ్వేన్ బ్రావో నిలవగా.. ఆ తర్వాత ఇమ్రాన్ తాహిర్ 320 మ్యాచ్‌ల్లో మరియు సునీల్ నరైన్ 362 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించారు. ఇక ఇదే టోర్నమెంట్‌లో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగిన సమయంలో టీ20 ఇంటర్నేషనల్స్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్ గా కూడా రషీద్ రికార్డు క్రియేట్ చేసాడు. రషీద్ తన 53వ మ్యాచ్‌లో 100వ వికెట్‌ను కైవసం చేసుకున్నాడు.