Site icon NTV Telugu

Pakistan: అత్త మీద కోపం దుత్త మీద.. భారత జర్నలిస్టుపై రమీజ్ రాజా దురుసు ప్రవర్తన

Ramiz Raja

Ramiz Raja

Pakistan: పాకిస్థాన్ ఆసియాకప్ గెలవకపోవడంతో ఆ దేశ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అయితే అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు రమీజ్ రాజా ఇండియన్ జర్నలిస్టుపై తన కోపాన్ని ప్రదర్శించాడు. ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై పాకిస్థాన్ ఓటమితో అభిమానులు నిరాశకు గురయ్యారు..మీరు వారికి ఏం సందేశం ఇస్తారంటూ ఇండియన్ జర్నలిస్ట్ అడగ్గా.. ‘నువ్వు కచ్చితంగా భారతీయుడివై ఉంటావ్. మా ఓటమి తర్వాత భారతీయులే సంతోషంగా ఉన్నారు’ అంటూ రమీజ్ రాజా ఎద్దేవా చేస్తూ మాట్లాడాడు. అంతేకాకుండా భారత జర్నలిస్ట్ ఫోన్ లాక్కునేందుకు ఆయన ప్రయత్నించాడు. అనంతరం వెంటనే ఆ ఫోన్‌ను తిరిగి జర్నలిస్టుకు ఇచ్చేశాడు. ఈ వీడియోను సదరు జర్నలిస్టు ట్విట్టర్లో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. తాను ఏదైనా తప్పు అడిగానా అంటూ సదరు జర్నలిస్ట్ రమీజ్ రాజాను ప్రశ్నించాడు.

Read Also:The Fabelmans : నిజంగా… స్టీవెన్ స్పీల్ బెర్గ్ అంత కష్టపడ్డాడా!?

కాగా పాకిస్థాన్ ఓటమిపై షోయబ్ అక్తర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓపెనర్ రిజ్వాన్ ఇన్నింగ్స్ వల్ల జట్టుకు పైసా ఉపయోగం కలగలేదని మండిపడ్డాడు. పాకిస్థాన్ టీం కాంబినేషన్ ఏమాత్రం బాగోలేదని షోయబ్ అక్తర్ విమర్శించాడు. జట్టులో చాలా విషయాలు పరిశీలించాలని సూచించాడు. ఫకార్ జమాన్, ఇఫ్తికార్ అహ్మద్, ఖుష్దిల్ అందరినీ ఒకసారి పరీక్షించాలన్నాడు. జట్టుకు వాళ్లు సెట్టవుతారో కాదో చూడాలని అక్తర్ అన్నాడు. రిజ్వాన్ దాదాపు 50బంతుల్లో 50పరుగులు చేశాడని.. దాని వల్ల పాకిస్థాన్‌కు నయా పైసా ప్రయోజనం లేదన్నాడు. బాగా ఆడి కప్‌ను గెలిచిన శ్రీలంకను అక్తర్ ప్రశంసించాడు. ఆ జట్టు కూర్పు చాలా బాగుందని అభిప్రాయపడ్డాడు.

Exit mobile version