PV Sindhu: క్రీడా రంగంలో ఏఐ విప్లవం.. అథ్లెట్ల కోసం ‘టెంపుల్’ స్మార్ట్ సెన్సార్ ప్యాచ్.. ప్రత్యేక ఆకర్షణగా పీవీ సింధు!
- క్రీడా రంగంలో అందుబాటులోకి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం
- అథ్లెట్ల కోసం ‘టెంపుల్’ స్మార్ట్ సెన్సార్ ప్యాచ్
- క్రీడాకారుల ఫిట్నెస్, ఫోకస్, అలసట స్థాయి అంచనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PV Sindhu Uses Temple Smart Sensor Patch: క్రీడా రంగంలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ‘టెంపుల్’ పేరుతో పిలిచే చిన్న వేరబుల్ ఏఐ సెన్సార్ ప్యాచ్ ప్రస్తుతం స్పోర్ట్స్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. అథ్లెట్లు తమ తల భాగంలో, ముఖ్యంగా కనుబొమ్మల పక్కన ఉండే టెంపుల్ ప్రాంతంలో ఈ పరికరాన్ని ధరిస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో పనిచేసే ఈ స్మార్ట్ డివైస్.. క్రీడాకారుల శారీరక, మానసిక పరిస్థితులను రియల్ టైమ్‌లో విశ్లేషించి కీలక సమాచారాన్ని అందిస్తుంది. క్రీడాకారుల ఫిట్నెస్, ఫోకస్, అలసట స్థాయిలను అంచనా వేయడంలో ఈ డివైస్ కీలక పాత్ర పోషిస్తుంది.
టెంపుల్ సెన్సార్ ప్యాచ్‌లో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించారు. ఇది అథ్లెట్ల మెదడులో రక్తప్రసరణ ఎలా జరుగుతోందో నిరంతరం ట్రాక్ చేస్తుంది. అలాగే క్రీడాకారుల మానసిక ఒత్తిడి స్థాయి, మెదడు చురుకుదనం వంటి అంశాలను కూడా గుర్తిస్తుంది. ఈ సమాచారాన్ని అప్పటికప్పుడు కోచ్‌లు, ట్రైనర్లకు అందిస్తుంది. దాంతో ఒక అథ్లెట్ ఎంత అలసటకు గురవుతున్నాడు, ఇంకా ఎంతసేపు శిక్షణ తీసుకోవచ్చు, ఎప్పుడు విశ్రాంతి అవసరం వంటి విషయాలపై కోచ్‌లు ఖచ్చితమైన అంచనాలకు రానున్నారు.
Also Read
- Sunrisers: బోణి కొట్టిన సన్ రైజర్స్.. ఎమ్ఐ లండన్‌పై ఘన విజయం..
- ICC ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ విడుదల.. టాప్‌లోకి దూసుకొచ్చిన రోహిత్ శర్మ..
- Zimbabwe Captain: ‘వైభవ్ సూర్యవంశీ బ్యాటింగా..? అయితే ఏంటి..? ఇదిగో ఇలా పంపిస్తాం’
- Virat Kohli and Anushka Sharma: బురదలో చెప్పులు లేకుండా నడిచిన విరాట్, అనుష్క.. స్టార్ కపుల్ బృందావన్ వీడియో వైరల్..
ఇప్పటివరకు కోచ్‌లు అథ్లెట్ల శారీరక పరిస్థితిని అనుభవం ఆధారంగా అంచనా వేసేవారు. కానీ ఇప్పుడు ఈ ఏఐ డివైస్ ద్వారా ఖచ్చితమైన డేటా అందుబాటులోకి రానుంది. దీంతో అథ్లెట్లు తమ ప్రదర్శనను మరింత మెరుగుపరుచుకోవడంతో పాటు గాయాల ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా హై-పర్ఫార్మెన్స్ స్పోర్ట్స్‌లో ఇది గేమ్‌చేంజర్‌గా మారే అవకాశం ఉంది. భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఇప్పటికే ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. శిక్షణ సమయంలోనే కాకుండా లైవ్ మ్యాచ్‌ల్లో కూడా టెంపుల్ పనితీరును పరీక్షిస్తున్నారు.
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ భాగస్వామ్యంతో ఈ స్మార్ట్ సెన్సార్‌ను అభివృద్ధి చేయడం మరింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ టెక్నాలజీ.. భవిష్యత్తులో ప్రపంచ క్రీడా రంగంలో పెద్ద మార్పులకు నాంది పలకనుందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ప్రతిష్టాత్మక ‘ఇండియన్ స్పోర్ట్స్ సమ్మిట్’ 2026లో పీవీ సింధు పాల్గొనగా.. ఆమె ధరించిన ఏఐ సెన్సార్ ప్యాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ కూడా టెంపుల్ గురించి తెలుసుకున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
-
ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
-
Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్‌ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
-
Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!