Prithvi Shaw: నా మౌనాన్ని బలహీనతగా భావించొద్దు.. చట్టపరమైన చర్యలు తీసుకుంటా.. పృథ్వీ షా వార్నింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prithvi Shaw Warning: టీమిండియా బ్యాటర్ పృథ్వీ షా మరోసారి వార్తల్లో నిలిచాడు. భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై షా తీవ్రంగా తాజాగా స్పందించాడు. తన వ్యక్తిగత జీవితం, గతాన్ని ప్రస్తావిస్తూ తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా మాట్లాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘమైన నోట్‌ను షేర్ చేశాడు. అందులో యోగ్రాజ్ పేరును నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ.. ఇటీవల తనపై చేసిన వ్యాఖ్యలకు సమాధానంగానే పృథ్వీ షా ఈ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది.
స్పోర్ట్స్ లాంచ్‌ప్యాడ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగ్రాజ్ సింగ్ మాట్లాడుతూ.. పృథ్వీ షా కెరీర్ పతనానికి అతడి జీవనశైలే కారణమని వ్యాఖ్యానించాడు. గతంలో భారత మాజీ బ్యాటర్ వినోద్ కాంబ్లీ ఎదుర్కొన్న పరిస్థితులతో షాను పోల్చాడు. ‘పృథ్వీ షా కెరీర్ ఎందుకు దిగజారింది?. గతంలో వినోద్ కాంబ్లీ విషయంలోనూ ఇదే జరిగింది. పార్టీలు, మహిళలతో సంబంధాలు, సిగరెట్లు, మద్యం ఇందుకు కారణం. కాంబ్లీకి ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అర్ధరాత్రి దాటిన తర్వాత గదికి వచ్చేవాడు. ఒకసారి అతడిని ఈ విషయంపై ప్రశ్నించాను. కానీ తన రోజులు అయిపోయాయని, తాము భిన్నమైన క్రికెట్ ఆడుతున్నామని సమాధానమిచ్చాడు. మరుసటి రోజు కోర్ట్నీ వాల్ష్ బౌలింగ్‌లో అతడు ఔటయ్యాడు. తర్వాత అతడితో ఉన్న అమ్మాయి కూడా వెళ్లిపోయింది. సిగరెట్లు, మద్యం ఇచ్చేవారు కూడా లేకుండా పోయారు. షా విషయంలోనూ ఇలాగే జరిగింది. చెడు స్నేహాలు, పార్టీలు, మద్యం వంటి అలవాట్లు ఉంటే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయి’ అని యోగ్రాజ్ అన్నాడు.
Also Read
- Shubman Gill: శుభ్‌మన్ గిల్.. నువ్వు ఓ కెప్టెన్! మైదానంలోనే అలా చేయడం సరికాదు!
- Sourav Ganguly: మీకేమైనా మైండ్ పని చేస్తుందా..? టెస్టు డ్రాపై గంగూలీ కీలక వ్యాఖ్యలు..
- Irfan Pathan: తెరవెనుక నుంచే ధోనీ మార్గనిర్దేశం.. వేలంలో పాల్గొనడంపై ఇర్ఫాన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- IND vs NZ 1st Test: 42 మెయిడిన్ ఓవర్లు.. 43 ఓవర్ల పాటు బ్యాటింగ్.. నాలుగు టెస్టులు డ్రా.. అరుదైన రికార్డులు ఇవే!
యోగ్రాజ్ వ్యాఖ్యలపై స్పందించిన పృథ్వీ షా.. తన గతం గురించి దాచాల్సిందేమీ లేదని స్పష్టం చేశాడు. ‘నా గతం నా జీవితంలో ఒక భాగం. దాచడానికి లేదా సిగ్గుపడటానికి లేదు. అయితే నా పేరును, వ్యక్తిగత జీవితాన్ని, గతాన్ని ఉపయోగించుకుని నాపై దుష్ప్రచారం చేయడం, అనవసర వివాదాలు సృష్టించడం, నా ప్రతిష్ఠను దెబ్బతీయడంను సహించను. ఓ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి, ఉద్దేశపూర్వకంగా తప్పుడు వ్యాఖ్యలు చేయడానికి మధ్య చాలా తేడా ఉంది. ఇది చివరి హెచ్చరికగా భావించండి. ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తులు లేదా ప్లాట్‌ఫామ్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా’ అని షా తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Prithvi Shaw: నా మౌనాన్ని బలహీనతగా భావించొద్దు.. చట్టపరమైన చర్యలు తీసుకుంటా.. పృథ్వీ షా వార్నింగ్!
-
RBI Digital Payment Rules: డిజిటల్ పేమెంట్లపై RBI కొత్త రూల్స్.. డబ్బు బదిలీకి గంటలోపు అనుమతి తప్పనిసరి!
-
Koti Deepotsavam 2026: నేడు అరుణాచలేశ్వరుడికి మహానీరాజనం.. కార్తీక పౌర్ణమి వేళ విశేష కార్యక్రమాలు ఇవే..!
-
PUBG MOBILE గ్లోబల్ ఛాంపియన్‌షిప్‌కు స్పాన్సర్ గా REDMAGIC.. 11S Pro స్మార్ట్‌ఫోన్‌తో గేమింగ్ సందడి..!
-
రూ.399కే అన్లిమిటెడ్ డేటా, OTT బెనిఫిట్స్..! Jio Happy New Year 2027 ఆఫర్ లాంచ్..
ట్రెండింగ్
-
12,000 నిట్స్ బ్రైట్నెస్, 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. డిసెంబర్ 9న Motorola Signature 27 లాంచ్..!
-
Gas Stove Knob Cleaning Tips : గ్యాస్ స్టవ్ నాబ్లపై జిడ్డు మరకలా?.. ఈ సింపుల్ ట్రిక్‌తో మాయం!
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్‌బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!