Rishabh Pant: అవన్నీ తప్పుడు వార్తలు.. అదే నిజమైతే పంత్ బతికేవాడు కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Police Thrashes Fake News On Rishabh Pant Accident: ఓవైపు టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే.. మరోవైపు అతని గురించి కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. తాగి నడపడం వల్లే అతని కారు ప్రమాదానికి గురైందంటూ సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. తాగిక మైకంలోనే పంత్ డివైడర్‌ని ఢీ కొట్టాడని, లేకపోతే ఈ ప్రమాదం సంభవించేదే కాదని చెప్తున్నారు. అయితే.. అందులో ఏమాత్రం వాస్తవం లేదంటూ, ఆ ప్రచారాన్ని పోలీసులు ఖండించారు. ప్రమాదం జరిగిన సమయంలో పంత్ మద్య సేవించలేదని, అతడు తాగి కారు నడపలేదని, ఇవన్నీ తప్పుడు వార్తలు స్పష్టం చేశారు. ఒకవేళ పంత్ తాగి కారు నడిపి ఉంటే.. అంత దూరం ఎలాంటి వస్తాడని తిరిగి ప్రశ్నించారు. యాక్సిడెంట్ జరిగినప్పుడు పంత్ సాధారణ స్థితిలోనే ఉన్నట్లు వైద్యులు నిర్థారించారన్నారు.
Road Accident: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Also Read
- Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
- Jasprit Bumrah: వన్డేలకు దూరంగా జస్పీత్ బుమ్రా.. టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇదే..
- Yuvraj Singh: ఇప్పుడు కాదు.. 25 ఏళ్లుగా అయనకు అసిస్టెంట్‌నే!
- Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
హరిద్వార్ సీనియర్ ఎస్పీ అజయ్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘మేము సుమారు 8, 10 స్పీడ్ కెమెరాలను పరిశీలించాం. ఒకవేళ పంత్ మద్యం సేవించి ఉంటే, ఢిల్లీ నుంచి 200 కి.మీ. దూరం ప్రయాణం చేసేవాడు కాదు. ప్రమాదం జరిగినప్పుడు పంత్ సాధారణ స్థితిలోనే ఉన్నాడని, అతనికి ప్రాథమిక చికిత్స అందించిన వైద్యుడు వెల్లడించాడు. పంత్ మద్యం సేవించలేదు కాబట్టే.. కారులో నుంచి బయటకు రాగలిగాడు. నిజానికి.. తాగినవాళ్లు ఆ సమయంలో కారు నుంచి బయటకు రాలేరు. మద్యం మత్తులో ప్రాణాలు కోల్పోయేవారు. పంత్ తాగలేదు కాబట్టే, బయటకు వచ్చాడు. పైగా.. పంత్‌ను రక్షించిన బస్ డ్రైవర్‌తో కూడా పంత్ మాములుగానే మాట్లాడాడు. అది సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డ్ అయ్యింది. పంత్ తన కారుని 80 కిలోమీటర్ల వేగ పరిమితికి మించి నడపలేదు. బహుశా నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుంది. అయితే.. 80 కిమీ వేగంతో నడపడం వల్లే కారు గాల్లో పల్టీలు కొట్టింది’’ అని చెప్పారు.
Bhakthi Tv New Year Stothra Parayanam Live: న్యూ ఇయర్ మొదటి రోజున ఈ స్తోత్రాలు వింటే….
తమ టెక్నికల్ టీమ్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారని, అక్కడ ఓవర్ స్పీడ్‌కు సంబంధించిన ఆధారాలు ఏవీ లభించలేదని అజయ్ సింగ్ తెలిపారు. నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేయడం ఏమాత్రం సమంజసం కాదని అన్నారు. కాగా.. పంత్ ప్రస్తుతం డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి ప్లాస్టిక్ సర్జరీ చేశారు. తీవ్ర గాయాలు అవ్వడంతో.. పంత్ కోలుకోవడానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుందని వైద్యులు పేర్కొన్నారు. దీంతో.. అతడు ఈ ఏడాది క్రికెట్ ఆడటం అనుమానాస్పదంగా మారింది.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!