NTV Telugu Site icon

Irfan Pathan: “గాజా”పై ఇర్ఫాన్ పఠాన్ పోస్ట్.. పాకిస్తాన్ హిందువుల గురించి మాట్లాడాలన్న కనేరియా..

Irfan Pathan

Irfan Pathan

Irfan Pathan: ఇజ్రాయిల్-హమాస్ మధ్య పోరులు సామాన్య పాలస్తీనియన్లు చనిపోతున్నారు. అంతకుముందు అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడి 1400 మందిని ఊచకోత కోశారు. చిన్న పిల్లలని కూడా చూడకుండా అత్యంత పాశవికంగా తలలు కోసి చంపేశారు. ఈ దాడి తర్వాత ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇజ్రాయిల్, గాజాస్ట్రిప్ పై భీకర దాడి చేస్తోంది. హమాస్ సంస్థను పూర్తిగా నేలమట్టం చేసేదాకా విశ్రమించేది లేదని ఇజ్రాయిల్ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఈ యుద్ధంలో ప్రపంచం రెండుగా చీలిపోయింది. కొందరు పాలస్తీనాకు, మరికొందరు ఇజ్రాయిల్‌కి మద్దతు తెలుపుతున్నారు.

ఇదిలా ఉంటే గాజాలో ఇజ్రాయిల్ దాడుల్లో చాలా మంది పిల్లలు చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ‘‘గాజా’’పై సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు.‘‘ప్రతీ రోజూ గాజాలో 0-10 ఏళ్ల వయసున్న అమాయక పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచం నిశ్శబ్ధంగా ఉంది. ఒక క్రీడాకారుడిగా, నేను మాత్రమే మాట్లాడగలను. కానీ ప్రపంచ నాయకులు ఏకమైన ఈ తెలివితక్కువ హత్యల్ని అంతం చేయాలి’’ అంటూ ఎక్స్(ట్విట్టర్)లో శుక్రవారం పోస్ట్ చేశారు.

Read Also: Women Soldiers: మహిళా సైనికులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ప్రసూతి, చైల్డ్ కేర్ సెలవుల ప్రతిపాదనకు ఆమోదం..

ఇర్ఫాన్ పఠాన్ పోస్టుకు పాకిస్తాన్ మాజీ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా స్పందించారు. పఠాన్‌ని పొగుతూనే ..‘‘ఇర్ఫాన్ భాయ్, మీరు పిల్లల బాధను అర్థం చేసుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను మరియు నేను మీతో పాటు ఉంటాను. కానీ దయచేసి పాకిస్తానీ హిందువుల గురించి కూడా మాట్లాడండి. . ఇక్కడ పాకిస్తాన్‌లో పరిస్థితి అందుకు భిన్నంగా లేదు.’’ అన్నారు.

పాకిస్తాన్ క్రికెట్ టీంలో పేరు సంపాదించుకున్న ఏకైక హిందువు డానిష్ కనేరియానే. తాను జట్టుకు ఆడుతున్న సమయంలో ఎలాంటి మతవివక్షను ఎదుర్కొన్నదానిని ఇటీవల ఆయన బయటపెట్టారు. షాహీద్ అఫ్రిది తనను మతం మార్చుకోవాలని బలవంతం చేసే వాడని, ఆ సమయంలో ఇంజమామ్, షోయబ్ అక్తర్ అండగా నిలిచారని వెల్లడించారు. పాకిస్తాన్ ఆట తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.