Pakistan Cricket Board: ఆసియా కప్ వేదిక మారిస్తే.. టోర్నీని బహిష్కరిస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Cricket Board: పాకిస్థాన్‌లో వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్‌లో టీమిండియా పాల్గొనే విషయంపై వివాదం నడుస్తోంది. పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో ఆడేందుకు టీమిండియా విముఖత చూపిస్తోంది. ఇదే జరిగితే ఆసియా కప్ కళ తప్పుతుంది. దీంతో పాకిస్థాన్ బోర్డు బెదిరింపు చర్యలకు పాల్పడుతోంది. భారత్ తమ దేశానికి వచ్చి ఆసియా కప్ ఆడకుంటే.. తాము కూడా ఇండియాలో జరిగే వన్డే ప్రపంచకప్‌కు దూరంగా ఉంటామని గతంలోనే చెప్పింది. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌ను తటస్థ వేదికలో నిర్వహిస్తే బాగుంటుందని ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు బీసీసీఐ సూచిస్తోంది. ఈ మేరకు ఆసియా కప్ ఆతిథ్యాన్ని పాకిస్థాన్ నుంచి మరొక వేదికకు మారుస్తారనే ప్రచారం జరుగుతోంది.
అయితే తాజాగా ఈ అంశంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా స్పందించారు. ఆసియా కప్ వేదిక మారిస్తే తాము టోర్నీని బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఆసియా కప్ ఆతిథ్య హక్కులను ఇవ్వమని తాము కోరుకోవడం లేదని.. కానీ తమకు ఆ హక్కులు పారదర్శకంగా వచ్చాయని.. భారత్ రాకపోతే అది వారి ఇష్టమని తెలిపాడు. కానీ ఆసియా కప్ వేదికను మారిస్తే మాత్రం తాము ఈ టోర్నీలో పాల్గొనేది లేదని రమీజ్ రాజా స్పష్టం చేశారు. దీంతో కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్లు ఈ వ్యవహారం తయారైంది. పాకిస్థాన్‌లో ఆసియా కప్ నిర్వహిస్తే టీమిండియా ఆడనంటోంది.. తటస్థ వేదికలో నిర్వహిస్తే పాకిస్థాన్ ఆడనంటోంది. మొత్తానికి ఈ వ్యవహారం ఆసియా క్రికెట్ కౌన్సిల్ మెడకు చుట్టుకుంది.
Also Read
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
- IPL 2026: ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ మారుతుందా? బీసీసీఐ, కేంద్రం ఆదేశాలపై ఉత్కంఠ!
- Virat Kohli: కోహ్లీ ‘స్టంప్ మైక్’ సీక్రెట్ లీక్.. పంజాబ్‌ను దెబ్బకొట్టిన ఆర్సీబీ వ్యూహం.. ప్లేఆఫ్స్ వేళ సరికొత్త చర్చ..
- Jasprit Bumrah-BCCI: ఆఫ్ఘనిస్థాన్‌తో టెస్టు.. జస్ప్రీత్ బుమ్రాకు బీసీసీఐ కండిషన్!
Read Also: Premarital Affairs: పెళ్లికి ముందు సెక్స్ చేశారో ఇక అంతే.. ఆ దేశంలో భారీ జరిమానా, జైలు శిక్ష
పాకిస్థాన్ చివరగా 2009 ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇచ్చిందవి. అప్పుడు లాహోర్‌లోని గడాఫీ స్టేడియానికి సమీపంలో శ్రీలంక ఆటగాళ్లపై ఉగ్రదాడి జరగడంతో అప్పటి నుంచి ఆ దేశంలో ఇతర జట్లు పర్యటించడానికి వెనుకాడాయి. చాలా కాలం తర్వాత 2015లో జింబాబ్వే జట్టు మూడు వన్డేల సిరీస్ కోసం పర్యటించింది. అనంతరం 2017లో శ్రీలంక జట్టు వన్డే సిరీస్ ఆడింది. ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియా కూడా పర్యటించింది. తాజాగా ఇంగ్లండ్ జట్టు కూడా పాకిస్థాన్‌లో పర్యటిస్తోంది.
తాజావార్తలు
-
Eating on Banana Leaves: అరిటాకులో భోజనం.. సంప్రదాయం వెనుక దాగి ఉన్న అద్భుత ఆరోగ్య రహస్యాలు..!
-
Cancer Injection: భారత్‌లో 7 నిమిషాల్లో క్యాన్సర్ ఇంజెక్షన్.. కానీ ధర వింటే షాక్.
-
Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
-
Twisha Sharma: పెళ్లైన 5 నెలలకే తెలుగు హీరోయిన్ మృతి!
-
Noida Woman: ‘అమ్మా ఇక్కడ నరకంగా ఉంది’.. నోయిడా యువతి మర్డర్ కేసులో వాట్సాప్ చాట్ వైరల్..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!